పవన్ కల్యాణ్‌ ఆస్తి మహేష్ బాబు ఆస్తి కన్నా మరీ ఇంత తక్కువా ?

October 5, 2021 8:16 PM

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి ఆదాయం రూ.కోట్లలోనే ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. వీరు ఒక సినిమా తీస్తే రూ.కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అదే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేసినా లేదా చిన్న స్టెప్పులు వేసినా లేదా ఏదైనా ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించినా రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు.

Pawan Kalyans property is much less than Mahesh Babu property

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తే ఆయనకు వచ్చే వార్షిక ఆదాయం రూ.180 కోట్లు. ఇక మహేష్ బాబు నటించిన సినిమాకు సుమారుగా రూ.25 నుంచి రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఈ లెక్కన చూస్తే మహేష్ బాబు ఆస్తిపాస్తులు సుమారుగా రూ.8 వేల కోట్లకు పైగా ఉన్నాయని, వందల కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నాయని తెలుస్తోంది.

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరోతో సినిమా తీయాలంటే దర్శక నిర్మాతలు డబ్బు బాగా ఆయనకు ముట్ట చెప్పాల్సిందే. అంతటి క్రేజ్ ఉన్న ఈ హీరో ఒక్కో సినిమాకు రూ.కోట్లలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఆస్తుల విషయానికి వస్తే రూ.52 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. చరాస్ధుల విలువ రూ.12 కోట్లు కాగా, స్ధిరాస్తుల విలువ రూ.40 కోట్లు అని సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now