Pawan Kalyan : రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ ఒక్క చోట కూడా ఎందుకు గెల‌వ‌లేదు : పోసాని కృష్ణమురళి

September 27, 2021 11:52 PM

Pawan Kalyan : సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు చెందిన తాజా చిత్రం రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగుతూనే ఉంది. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా స్పందిస్తున్నారు. కొంద‌రు న‌టులు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌గా.. ఏపీకి చెందిన మంత్రుల‌తోపాటు మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు ప‌వ‌న్‌ను విమ‌ర్శించారు. ఆయ‌న అలా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. అయితే ఇదే విష‌యంపై న‌టుడు పోసాని కృష్ణమురళి తాజాగా స్పందించారు.

Pawan Kalyan : రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ ఒక్క చోట కూడా ఎందుకు గెల‌వ‌లేదు : పోసాని కృష్ణమురళి
Pawan Kalyan Why Not Won In Single Seat Posani Krishna Murali Asks

సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయ‌న ప్ర‌శ్న‌ల‌కు ఆయనే స‌మాధానాలు చెప్పుకుంటార‌ని అన్నారు. ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌డంలో త‌ప్పేమీ లేద‌ని, కానీ ఆయ‌న అన్న‌మాట‌ల‌కు ఆధారాలు చూపాల‌ని అన్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడిన భాష స‌రిగ్గా లేద‌ని పోసాని కృష్ణమురళి అన్నారు. చిరంజీవి ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడ‌లేద‌ని, ఆయ‌న‌తో రాజ‌కీయంగా విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడ‌లేద‌ని అన్నారు. ఏపీ సీఎం, మంత్రుల‌ను ప‌వ‌న్ తిట్ట‌డం స‌రికాద‌ని అన్నారు.

Pawan Kalyan : రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ ఒక్క చోట కూడా ఎందుకు గెల‌వ‌లేదు : పోసాని కృష్ణమురళి
Pawan Kalyan

రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వన్ క‌ల్యాణ్ తిరిగార‌ని, ఒక్క చోట కూడా ఎందుకు గెల‌వ‌లేక‌పోయార‌ని పోసాని కృష్ణమురళి ప్ర‌శ్నించారు. సీఎం జ‌గ‌న్‌కు, ప‌వ‌న్‌కు పోలిక లేద‌ని, సీఎం జ‌గ‌న్ ప‌నితీరును దేశ మొత్తం గుర్తించింద‌ని కొనియాడారు. రెండేళ్ల‌లోనే ఏపీలో పాఠ‌శాల‌ల రూపురేఖ‌ల‌ను జ‌గ‌న్ మార్చార‌ని, అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ కొన‌సాగిస్తున్నార‌ని అన్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఏమిటో అంద‌రికీ తెలుస‌ని, ఆయ‌నకు, జ‌గ‌న్‌కు పోలికే లేద‌న్నారు. చంద్ర‌బాబును ప‌వ‌న్ ఎప్పుడైనా ప్ర‌శ్నించారా ? అని పోసాని అన్నారు. కాగా పోసాని చేసిన వ్యాఖ్య‌లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now