Pawan Kalyan : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హిరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు హీరోలు కథ నచ్చకనో, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో మిస్ చేసుకున్న సినిమా కథలు మరో హీరో వద్దకు వెళ్లడం, సినిమా బాగుండి సూపర్ హిట్ అవ్వడం సాధారణమే. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన బద్రి సినిమాకు కూడా మొదటి ఆప్షన్ పవన్ కళ్యాణ్ కాదట. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో అమిషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో టైటిల్ రోల్ లో ఉన్న బద్రి క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు చేయలేరేమో అనే రేంజ్ లో యాక్ట్ చేసాడు పవన్. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. బద్రి సినిమాను విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై టీ. త్రివిక్రమరావు నిర్మించగా 2000 సంవత్సరంలో ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమాకు ముందుగా పూరీ జగన్నాథ్ నాగార్జునను అనుకున్నారట. పూరీ ఆర్జీవీ వద్ద శిష్యరికం చేసిన సంగతి తెలిసిందే.
ఆర్జీవీ నాగార్జున మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో పూరీ నాగార్జునను ఊహించుకుని కథను రాసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున వద్దకు వెళ్లి కథ వినిపించారు. కానీ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో పూరీ వరుస హిట్లతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కు ఈ కథను వినిపించారు. పవన్ కూడా కథలో కొన్ని మార్పులు చేయాలని కోరారు. పూరీ క్లైమాక్స్ మాత్రం మార్చనని తెగేసి చెప్పారట. అయినప్పటికీ పవన్ ఓకే చెప్పారు. అలా బద్రి సినిమాకు నాగ్ నో చెప్పడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…