Pawan Kalyan : నాగార్జున‌ రిజెక్ట్ చేసిన‌ ఆ కథతో పవన్ సూపర్ హిట్ కొట్టిన మూవీ.. ఏంటో తెలుసా..?

October 23, 2022 7:51 AM

Pawan Kalyan : ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మ‌రో హిరో చేసి హిట్ కొట్టిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు హీరోలు కథ నచ్చకనో, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్లనో మిస్ చేసుకున్న సినిమా క‌థలు మ‌రో హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌డం, సినిమా బాగుండి సూపర్ హిట్ అవ్వడం సాధార‌ణ‌మే. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన బద్రి సినిమాకు కూడా మొదటి ఆప్షన్ పవన్ కళ్యాణ్ కాదట. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో అమిషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో టైటిల్ రోల్ లో ఉన్న బద్రి క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు చేయలేరేమో అనే రేంజ్ లో యాక్ట్ చేసాడు పవన్. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. బద్రి సినిమాను విజయలక్ష్మి మూవీస్ బ్యానర్ పై టీ. త్రివిక్రమరావు నిర్మించగా 2000 సంవత్సరంలో ఏప్రిల్ 20న ఈ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమాకు ముందుగా పూరీ జగన్నాథ్ నాగార్జునను అనుకున్నారట. పూరీ ఆర్జీవీ వద్ద శిష్యరికం చేసిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan got super hit with Nagarjuna rejected movie
Pawan Kalyan

ఆర్జీవీ నాగార్జున మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో పూరీ నాగార్జునను ఊహించుకుని కథను రాసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున వద్దకు వెళ్లి కథ వినిపించారు. కానీ అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాంతో పూరీ వరుస హిట్లతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కు ఈ కథను వినిపించారు. పవన్ కూడా కథలో కొన్ని మార్పులు చేయాలని కోరారు. పూరీ క్లైమాక్స్ మాత్రం మార్చనని తెగేసి చెప్పారట. అయినప్పటికీ పవన్ ఓకే చెప్పారు. అలా బద్రి సినిమాకు నాగ్ నో చెప్పడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now