Pawan Kalyan : న‌రేష్, ప‌విత్ర లోకేష్ వ్య‌వ‌హారం.. మధ్య‌లో ప‌వ‌న్‌ను లాగి ట్రోల్ చేస్తున్నారు..!

July 4, 2022 10:08 PM

Pawan Kalyan : సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, న‌టి ప‌విత్ర లోకేష్‌ల వ్య‌వ‌హారం రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. వీరిద్ద‌రూ మైసూర్‌లోని ఓ హోట‌ల్‌లో ఉండ‌గా.. అక్క‌డికి న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి చేరుకుని వీరిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. త‌రువాత ర‌మ్య ప‌విత్ర‌ను చెప్పుతో కొట్ట‌బోగా పోలీసులు అడ్డుకున్నారు. త‌రువాత అంద‌రినీ అక్క‌డి నుంచి పంపించివేశారు. అయితే ఈ ముగ్గురూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే న‌రేష్ త‌న భార్య ర‌మ్య‌కు ఇంకో అఫెయిర్ అంట గట్టారు. అలాగే ర‌మ్య మాట్లాడుతూ న‌రేష్‌కు, ప‌విత్ర‌కు ఆల్రెడీ పెళ్లి అయిపోయింద‌ని.. తాను న్యాయం పోరాటం చేస్తాన‌ని తెలిపారు.

ఇక ప‌విత్ర లోకేష్ మాట్లాడుతూ.. తాను న‌రేష్ క‌లిసే ఉంటున్నామ‌ని.. త‌మ‌కు సపోర్ట్ అందించాల‌ని కోరారు. అలాగే త‌న పేరిట వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌తోపాటు త‌న పేరిట ఓపెన్ అయి ఉన్న ఫేక్ అకౌంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఇక ప్ర‌స్తుతం క‌థ ఇక్క‌డి వ‌ర‌కు రాగా.. వీరి వ్య‌వ‌హారంలోకి తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను లాగారు. అందుకు కూడా ఒక కార‌ణం ఉంది. ప‌వ‌న్ ఈమ‌ధ్యే నాని మూవీ అంటే సుంద‌రానికీ.. ప్రీ రిలీజ్ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. అక్క‌డ న‌రేష్‌ను ఆయ‌న పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.

Pawan Kalyan being trolled in Naresh and Pavitra Lokesh issue
Pawan Kalyan

న‌రేష్ గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిషని, చెన్నైలో ప‌క్క ప‌క్క‌నే ఉండేవాళ్ల‌మ‌ని ప‌వ‌న్ తెలిపారు. న‌రేష్ ఎంతో హుందాగా ఉంటారంటూ ఆయ‌న‌ను ప‌వ‌న్ ఆకాశానికెత్తేశారు. అయితే న‌రేష్ వ్య‌వ‌హారం మొత్తం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో ఆయ‌న‌ను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అలాగే అంటే సుంద‌రానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ ఆయ‌న గురించి మాట్లాడిన మాట‌ల తాలూకు వీడియోను బ‌య‌ట‌కు తీసి.. ప‌వ‌న్‌, న‌రేష్ ఇద్ద‌రూ దొందూ దొందే.. ఒక‌రికి ఒక‌రు స‌రిపోయార‌ని అంటున్నారు. ఇద్దరూ మూడు పెళ్లిళ్లు చేసుకున్నార‌ని.. ఇద్ద‌రి క‌థ సేమ్ అని.. అలాంటిది న‌రేష్‌ను ప‌వ‌న్ పొగ‌డ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ప‌వ‌న్ అన‌వ‌స‌రంగా ఈ వివాదంలో ట్రోలింగ్‌కు గుర‌వుతుండ‌డంతో ఫ్యాన్స్ విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక న‌రేష్, ప‌విత్ర లోకేష్‌, ర‌మ్య‌ల క‌థ‌కు ఎప్పుడు శుభం కార్డు ప‌డుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now