Pavitra Lokesh : ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. కన్నడ నటి అయిన ఈమె ప్రస్తుతం తెలుగులో బిజియెస్ట్ క్యారక్టర్ ఆర్టిస్ట్ అయ్యింది. వరుస సినిమాలతో ఆమె కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. అయితే ఈమధ్య నరేష్ వ్యవహారంతో ఆమె మరింత వార్తల్లో నిలిచింది. నరేష్ తో పవిత్ర సహజీవనం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి వేరు వేరుగా దీనిపై వివరణ ఇచ్చుకున్నా ఆ తర్వాత ఇద్దరు ఒకే హోటల్ రూం లో కనబడటం, నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి వీరిపై ఎటాక్ చేయడం తెలిసిందే.
అంతకుముందు పవిత్ర చాలా క్లీన్ ఇమేజ్ తో సినిమాలు చేస్తూ వచ్చారు. నరేష్, పవిత్రల మధ్య ఈ వ్యవహారం ఎప్పటినుంచి ఉందో తెలియదు కానీ వారిద్దరూ కలిసి నటించినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నరేష్, పవిత్రల మ్యాటర్ బయటకు తెలిసిందో, స్క్రీన్ మీద వారు కనిపిస్తున్నప్పుడు ఆడియెన్స్ హడావిడి చేయడం మొదలు పెట్టారు. లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పవిత్ర లోకేష్ కనబడగానే థియేటర్ లో సందడి మొదలైంది. ఇక ఆమె నరేష్ తో కనిపించే సరికి కేకలు వేశారు. ఈ వ్యవహారం ఆమె కెరియర్ కు మైనస్ అవుతుందని అనుకుంటే ఆడియెన్స్ నుంచి ఈ రియాక్షన్ అసలు ఊహించలేదనే చెప్పొచ్చు.
అంతేకాదు అంతకుముందు రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకోని పవిత్ర ఇప్పుడు తన రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. నరేష్ కూడా పవిత్ర కోసం రికమెండేషన్ చేస్తున్నారట. అయితే పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్ మాత్రం ఆమె డబ్బు మనిషని.. నరేష్ ని కూడా కొన్నాళ్లకు వదిలేస్తుందని అన్నారు. ఎవరు ఎలా అనుకున్నా సరే తమని ఎవరూ ఆపలేరు అన్నట్టుగా.. నరేష్, పవిత్రల వ్యవహారం ఉంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…