NTR : ఎన్‌టీఆర్‌ కొత్త మూవీ టైటిల్‌.. ‘జై బావ్ రే’..?

October 28, 2021 9:30 PM

NTR : యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవ‌ల రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో దీనికి ప్యాక‌ప్ చెప్ప‌నున్నాడు. అనంత‌రం కొర‌టాల శివ‌తో క‌లిసి సినిమా చేయ‌నున్నాడు. డిసెంబర్‌లో కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం.

NTR new movie title jai bhav re

కొర‌టాల శివ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చిత్రాన్ని కూడా ప్రారంభిస్తాడట ఎన్టీఆర్. అనంతరం బుచ్చిబాబుతో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల బీ-టౌన్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

సంజయ్‌ లీలా భన్సాలీ.. ఎన్టీఆర్‌ కోసం పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్‌ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేగాక దీనికి ‘జై బావ్ రే’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట.

అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్ వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని అంటున్నారు. చూడాలి దీనిపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో..! మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి RRR movie విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను రాజమౌళి దుబాయ్ లో ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీ ఎత్తున నెలకొన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment