NTR : అప్పట్లో చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని చెప్పి ఎన్‌టీఆర్ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని ఆయన కోసం ప్రచారం చేశారు. కానీ అప్పటి నుంచి ఎన్‌టీఆర్ అసలు రాజకీయాల వైపు చూడడం లేదు. టీడీపీ నాయకులు కొందరు ఎన్నిసార్లు ఎన్‌టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినా.. ఈ విషయంపై మాత్రం ఆయన స్పందించడం లేదు. అయితే ఎన్‌టీఆర్‌ను మాత్రం కొందరు రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనను ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది.. అన్న విషయానికి వస్తే..
ఇటీవల ఏపీలో హత్య కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ అనంత బాబును ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ.. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే, చట్టానికి ఎవరూ అతీతులు కాదు, సీఎం జగన్ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా చట్టం ముందు ఒక్కటే. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదు.. అని అంబటి అన్నారు. అలాగే జూనియర్ ఎన్‌టీఆర్, బోనియర్ ఎన్‌టీఆర్ వస్తే బాగుండని టీడీపీ నేతలు అనుకుంటున్నారు, కానీ ఎవరు వచ్చినా సీఎం జగన్‌ను ఆపడం, అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు.. అని అంబటి స్పష్టం చేశారు. అయితే ఈ వివాదంలోకి ఎన్‌టీఆర్‌ను లాగడం, అలాగే ఆయనను విమర్శించడంపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబును వారు విమర్శిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఎన్‌టీఆర్‌కు సంబంధం లేని విషయంలో ఆయనను ఇలా లాగడం ఎందుకని ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మంత్రి అంబటి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించాల్సి ఉంది. ఆయన ఏమంటారు.. దీనిని సమర్థించుకుంటారా.. అన్నది తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…