Bucket : మనం ఇంట్లో వాడే ప్లాస్టిక్ బకెట్‌ల ఖరీదు ఎంత ఉంటుంది ? మహా అయితే రూ.200 నుంచి రూ.400 వరకు ఉంటుంది. చిన్నవి అయితే రూ.100 లోపే లభిస్తాయి. అయితే ఆ బకెట్ ధర ఎంతో తెలుసా ? అక్షరాలా రూ.26వేలు. అవును. నమ్మలేకున్నా ఇది నిజమే. ఓ సాధారణ ప్లాస్టిక్ బకెట్‌ను ఏకంగా రూ.26వేలకు విక్రయిస్తున్నారు. అయితే దాని అసలు ధర రూ.35,900 అట. దానిపై 28 శాతం డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. దీంతో బకెట్ ధరను రూ.25,999గా నిర్ణయించారు. ఇక ఈ బకెట్‌ను అమెజాన్ లో విక్రయిస్తున్నారు.
అమెజాన్ లో విక్రయించబడుతున్న ఈ పింక్ కలర్ ప్లాస్టిక్ బకెట్ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. దీనికి నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా లభిస్తోంది. నెలకు రూ.1224 ఈఎంఐ చెల్లించి ఈ బకెట్‌ను నెలసరి వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. అయితే అంతటి ధర ఉన్నప్పటికీ ఇప్పుడీ బకెట్ గురించి వెదికితే అందులో దొరకడం లేదు. నో స్టాక్ అని దర్శనమిస్తోంది. అంటే.. అంతటి ధర పెట్టి మరీ ఆ బకెట్‌ను ఎవరో కొని ఉంటారని అర్థం చేసుకోవచ్చు. దాన్ని కొన్న అభాగ్యుడు ఎవరబ్బా.. అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.
ఇక ఈ విషయంపై నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మా దగ్గరికి వస్తే రూ.26వేలకు ఎన్ని కావాలంటే అన్ని బకెట్లను ఇస్తాం.. అసలు అంతటి ధర పెట్టి ఆ బకెట్‌ను కొన్న వ్యక్తి ఎవరు.. బకెట్ ధర ఇంతలా కూడా ఉంటుందా.. అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…