NTR : కొన్నాళ్లుగా క్షణం తీరిక లేకుండా గడుపుతూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో విహార యాత్రలో ఉన్నాడు. రీసెంట్‌గా ఎన్టీఆర్ ప్యారిస్‌కి వెళ్లగా ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ఈఫిల్ టవర్‌ని సందర్శించాడు. ఈఫిల్ టవర్ ముందు నిలుచొని ఫొటో దిగగా, ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూ లుక్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్‌ని చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు.
ఎన్టీఆర్ తన ఫ్యామిలీ విషయాలను.. తన తనయుల ఫోటోలను చాలా అరుదుగా పంచుకుంటాడు. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ చేశారు తారక్. ఈ క్రమంలో తన పెద్ద కుమారుడు అభయ్ రామ్‌ను ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోకల్ ట్రెయిన్‌లో ప్రయాణిస్తూ తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వెండితెరపై అలరించడమే కాకుండా బుల్లితెరకు హోస్ట్‌గాను వ్యవహరిస్తున్నారు. ”బిగ్ బాస్” షోకు హోస్ట్ గా వ్యవహరించిన ఆయన తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఎండ్‌కు వచ్చింది. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ కూడా పూర్తైయింది. ఈ క్రమంలోనే భార్య, కుమారులైన అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లాడు. వచ్చిన తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…