Uber : ప్రముఖ క్యాబ్ సంస్థ ఊబర్ తన సేవలను వరంగల్‌లో ప్రారంభించింది. వరంగల్ పౌరులు ప్రస్తుతం ఊబర్ సేవలను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఊబర్ సేవలు మన దేశంలో తొలుత 2013లో ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే మొదటగా బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించారు. తరువాత క్రమంగా అనేక పట్టణాలు, నగరాలకు ఊబర్ తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. అందులో భాగంగానే తాజాగా వరంగల్‌లోనూ ఊబర్ క్యాబ్ సేవలను ప్రారంభించింది.
ఇక వరంగల్‌లో క్యాబ్ సేవలను ప్రారంభించడంతో ఊబర్ ఖాతాలో 100 సిటీలు చేరాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 95 మిలియన్ల మంది రైడర్లు, డ్రైవర్లకు సేవలను అందించినట్లు ఊబర్ తెలియజేసింది. ప్రస్తుతం ఊబర్ ద్వారా కేవలం క్యాబ్ సర్వీస్‌లే కాకుండా.. ఊబర్ రెంటల్స్, ఊబర్ కనెక్ట్, ఆటో, మోటో, ఊబర్ మెడిక్, ఎసెన్షియల్, లాస్ట్ మైల్ డెలివరీ.. వంటి సేవలు కూడా లభిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో హెల్త్‌కేర్ వర్కర్లకు ఊబర్ సేవలను అందించిందని ఆ సంస్థ ఇండియా అండ్ సౌత్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ శివ శైలేంద్రన్ తెలిపారు.
ఈ ఏడాది కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.10 కోట్ల విలువైన ఉచిత రైడ్స్‌ను స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నామని తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో నవంబర్ 2021 వరకు 3 లక్షల మంది డ్రైవర్లకు కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ అయినా తీసుకున్నారని అన్నారు. తమ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు.
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…