Google Search : గూగుల్ సెర్చ్‌లో కొత్త స‌దుపాయాలు.. ఇక వ‌ర‌ద‌లు వ‌స్తే ముందే తెలుసుకోవ‌చ్చు..!

Google Search : ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ భార‌తీయ యూజ‌ర్ల కోసం తాజాగా అనేక కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక‌పై గూగుల్ ద్వారా కోవిన్‌లో టీకాలు తీసుకునేందుకు స్లాట్ ను బుక్ చేసుకోవ‌చ్చు. అలాగే వివిధ భార‌తీయ భాష‌ల‌కు సంబంధించి దివ్యాంగుల కోసం టూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. వాతావ‌ర‌ణ విశేషాల‌పై మ‌రింత మెరుగ్గా స‌మాచారం అందించ‌నుంది.

గూగుల్ కొత్త అప్‌డేట్ ప్ర‌కారం.. యూజర్లు 9 భార‌తీయ భాష‌ల్లో గూగుల్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్‌కు స్లాట్‌ను బుక్ చేసుకోవ‌చ్చు. అందుకు గాను గూగుల్ అసిస్టెంట్ స‌హాయ ప‌డుతుంది. ఇంగ్లిష్, హిందీ, గుజ‌రాతీ, క‌న్న‌డ‌, మ‌ళయాళం, బెంగాలీ, మ‌రాఠీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో యూజర్లు వ్యాక్సిన్ స్లాట్‌ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో అందిస్తారు.

గూగుల్‌లో యూజర్లు సెర్చ్ చేసే ప‌దాల‌ను గూగుల్ ఇక‌పై ఆటోమేటిగ్గా వారి మాతృభాష‌కు ట్రాన్స్‌లేట్ చేసి అందుకు త‌గిన విధంగా సెర్చ్ రిజ‌ల్ట్స్‌ను చూపిస్తుంది. అలాగే ప‌లు భార‌తీయ భాష‌ల్లో సెర్చ్ రిజ‌ల్ట్స్‌ను పెద్ద‌గా చ‌ద‌వ‌మ‌ని గూగుల్ సెర్చ్‌కు ఆదేశాలు ఇవ్వ‌వ‌చ్చు. ఇవి దివ్యాంగుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఇక గూగుల్ పేలోనూ ప‌లు మార్పుల‌ను తెచ్చారు. ఇక‌పై హిందీ, ఇంగ్లిష్ క‌ల‌గ‌లిపి హింగ్లిష్‌లో యూజ‌ర్లు ఈ యాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే వాయిస్ క‌మాండ్ల ద్వారా ఇత‌రుల‌కు డ‌బ్బులు పంపుకునే వెసులుబాటును కల్పించారు.

గూగుల్ పేలోనే ఇంకో ఫీచ‌ర్‌ను అందించారు. బిల్ స్ప్లిట్ అని పిల‌వ‌బ‌డుతున్న ఈ ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు ఒక బిల్లును పంచుకుని దాన్ని వారంద‌రూ ఒకేసారి చెల్లించ‌వ‌చ్చు. అలాగే వాతావ‌ర‌ణ విశేషాలు ఇక‌పై గూగుల్ సెర్చ్ లో మ‌రింత మెరుగ్గా తెలుస్తాయి.

ముఖ్యంగా గూగుల్‌.. సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డుతో భాగ‌స్వామ్యం అయింది క‌నుక.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను తెలుసుకోవ‌చ్చు. అలాగే స్థానిక వాతావ‌ర‌ణ విశేషాలు తెలుస్తాయి. వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటే.. వెంటనే చెప్పేస్తుంది. ఇలా గూగుల్ సెర్చ్ ప‌నిచేయ‌నుంది. ఇందులో కొత్త‌గా రానున్న ఈ ఫీచ‌ర్లు యూజ‌ర్ల‌కు ఎంతో సౌక‌ర్యాన్ని అందివ్వ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM