Nostradamus : అప్పట్లో.. అంటే.. 2012 డిసెంబర్ 21న ప్రపంచం ప్రళయం వచ్చి అంతం అవుతుందని చాలా మంది చెప్పారు. మయన్ల నాగరికత ప్రకారం.. ఆ తేదీ క్యాలెండర్‌లో చివరి తేదీ అని.. కనుక ఆ తేదీన ప్రపంచం అంతం అవుతుందని అన్నారు. అయితే అది తప్పని తేలింది. కానీ 2022లో ప్రళయాలు చాలా ఏర్పడుతాయని.. ప్రముఖ ఫ్రెంచి జ్యోతిష్యుడు మైకేల్ డి నాస్ట్రడామస్ ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం.. 2022లో ఏర్పడనున్న ఉత్పాతాల వివరాలు ఇలా ఉన్నాయి.
2022లో ప్రపంచ వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతాయని నాస్ట్రడామస్ చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఆ ఏడాదిలో ఆకాశం నుంచి భారీ సైజులో ఉండే ఉల్కలు భూమి మీద పడతాయట. సముద్రాల్లో అవి పడడం వల్ల భారీ ఎత్తున నీరు సముద్ర తీరం నుంచి బయటకు వస్తుందట. అది సునామీలా సమీపంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమిస్తుందట.
అలాగే 2022లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందట. దీంతో భారీగా ధరలు పెరుగుతాయి. అలాగే అమెరికా డాలర్ పూర్తిగా పతనం అవుతుందట. 2022లో పలు చోట్ల అణు బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందట. దీంతో భూమి స్వరూపమే మారిపోతుందని.. నాస్ట్రడామస్ చెప్పారు.
2022లో ప్రపంచం మొత్తం 72 గంటల పాటు కరెంటు ఉండదట. అలాగే తీవ్రమైన ప్రకృతి విపత్తులు ఏర్పడుతాయట. మంచు పెద్ద ఎత్తున కరుగుతుందట. అయితే విధ్వంసం అంతా జరిగాక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. ఆ విధ్వంసం కొన్ని గంటల పాటు ఉంటుందట.
ఇక వచ్చే ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల తీవ్రమైన తుఫాన్లు ఏర్పడుతాయట. కొన్ని చోట్ల తీవ్రమైన కరువు వస్తుందని చెప్పారు. అలాగే మనుషులు అధునాతన రోబోలను తయారు చేస్తే అవి మానవులను నాశనం చేస్తాయట. ఈ విధంగా నాస్ట్రడామస్ చెప్పారు. అయితే ఆయన చెప్పినవి కొన్ని.. అంటే.. వరదలు వంటివి ఇప్పటికే ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. మరి 2022లో ఏం జరుగుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…