Nostradamus : 2022లో ప్ర‌పంచం అంతం కానుందా ? నాస్ట్ర‌డామ‌స్ ఏం చెప్పారు ?

November 26, 2021 10:08 PM

Nostradamus : అప్ప‌ట్లో.. అంటే.. 2012 డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచం ప్ర‌ళ‌యం వ‌చ్చి అంతం అవుతుంద‌ని చాలా మంది చెప్పారు. మ‌య‌న్ల నాగ‌రిక‌త ప్ర‌కారం.. ఆ తేదీ క్యాలెండ‌ర్‌లో చివ‌రి తేదీ అని.. క‌నుక ఆ తేదీన ప్రపంచం అంతం అవుతుంద‌ని అన్నారు. అయితే అది త‌ప్ప‌ని తేలింది. కానీ 2022లో ప్ర‌ళయాలు చాలా ఏర్ప‌డుతాయ‌ని.. ప్ర‌ముఖ ఫ్రెంచి జ్యోతిష్యుడు మైకేల్ డి నాస్ట్ర‌డామ‌స్ ఎప్పుడో చెప్పారు. ఆయ‌న చెప్పిన ప్ర‌కారం.. 2022లో ఏర్ప‌డ‌నున్న ఉత్పాతాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Nostradamus told about 2022 predictions will world end in that year

2022లో ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌ని నాస్ట్రడామ‌స్ చెప్పారు. ఆయ‌న చెప్పిన ప్ర‌కారం.. ఆ ఏడాదిలో ఆకాశం నుంచి భారీ సైజులో ఉండే ఉల్క‌లు భూమి మీద ప‌డ‌తాయ‌ట‌. స‌ముద్రాల్లో అవి ప‌డ‌డం వ‌ల్ల భారీ ఎత్తున నీరు స‌ముద్ర తీరం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ట‌. అది సునామీలా స‌మీపంలో ఉన్న భూభాగాన్ని ఆక్ర‌మిస్తుంద‌ట‌.

అలాగే 2022లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాల్లో ద్ర‌వ్యోల్బ‌ణం అదుపు త‌ప్పుతుంద‌ట‌. దీంతో భారీగా ధ‌ర‌లు పెరుగుతాయి. అలాగే అమెరికా డాల‌ర్ పూర్తిగా ప‌త‌నం అవుతుంద‌ట‌. 2022లో పలు చోట్ల అణు బాంబు పేలుళ్లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ట‌. దీంతో భూమి స్వ‌రూప‌మే మారిపోతుంద‌ని.. నాస్ట్ర‌డామ‌స్ చెప్పారు.

2022లో ప్ర‌పంచం మొత్తం 72 గంట‌ల పాటు క‌రెంటు ఉండ‌ద‌ట‌. అలాగే తీవ్ర‌మైన ప్ర‌కృతి విప‌త్తులు ఏర్ప‌డుతాయ‌ట‌. మంచు పెద్ద ఎత్తున క‌రుగుతుంద‌ట‌. అయితే విధ్వంసం అంతా జ‌రిగాక ప్ర‌శాంత‌త ఉంటుంద‌ని చెప్పారు. ఆ విధ్వంసం కొన్ని గంట‌ల పాటు ఉంటుంద‌ట‌.

ఇక వ‌చ్చే ఏడాదిలో ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక చోట్ల తీవ్ర‌మైన తుఫాన్లు ఏర్ప‌డుతాయట‌. కొన్ని చోట్ల తీవ్ర‌మైన క‌రువు వ‌స్తుంద‌ని చెప్పారు. అలాగే మ‌నుషులు అధునాత‌న రోబోల‌ను త‌యారు చేస్తే అవి మాన‌వులను నాశ‌నం చేస్తాయ‌ట‌. ఈ విధంగా నాస్ట్ర‌డామ‌స్ చెప్పారు. అయితే ఆయ‌న చెప్పిన‌వి కొన్ని.. అంటే.. వ‌ర‌ద‌లు వంటివి ఇప్ప‌టికే ప్ర‌ళ‌యాన్ని సృష్టిస్తున్నాయి. మ‌రి 2022లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now