Nityananda : హీరోయిన్ రంజితను కైలాస దేశానికి రాణిని చేసిన నిత్యానంద స్వామి..!

October 28, 2021 11:01 PM

Nityananda : దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన స్వామి నిత్యానంద.. ఆయన ఎంత త్వరగా పాపులర్ అయ్యారో అంతే ఫాస్ట్ గా వివాదాలను ఎదుర్కున్నారు. దొంగ బాబాల పేరుతో చేసే మోసాలకు ప్రజలు నిజమైన భక్తి అంటూ పేరు పెట్టి పూజిస్తున్నారు. వారంతా ఫేక్ బాబాలు అని తేలడంతో బాధపడుతుంటారు. ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అవే మోసాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో నిత్యానంద స్వామి కూడా ఒకరు. బెంగుళూర్ లో బిడిది ధ్యాన పీఠాధిపతిగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన స్వామి నిత్యానంద రాసలీలల వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.

Nityananda made actress ranjitha as queen to his country

ఈ వార్తలు, వీడియోలు ఒక్కసారిగా భగ్గమంటూ దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఈ క్రమంలో డ్రగ్స్ ఆరోపణలతో పాటుగా, ఈయన ఆశ్రమంలో వన్య ప్రాణుల స్మగ్లింగ్ విషయంలో కూడా జైలు పాలయ్యారు. స్వామి నిత్యానంద ఆశ్రమంలో డ్రగ్స్ వాడకం ఉందని, ఏనుగు దంతాలు, పులి చర్మాల్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఆధారాలతో సహా పట్టుబడి శిక్ష ఖరారు అయ్యింది. ఆ తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన నిత్యానంద ఇండియాను వదిలేసి ఈక్వెడార్ కు పరారయ్యాడు.

అక్కడ తన కోసం కైలాసం అంటూ ఓ దేశాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈయన భక్తులు కూడా గుడ్డి నమ్మకంతో ఆ దేశానికి వీసాలు తీసుకుని మరీ వెళ్ళారు. తన కైలాస రాజ్యానికి రాజుగా మారారు. ఇప్పుడు ఈ కైలాస దేశానికి రాణి కూడా సెట్ అయ్యింది.

గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన రాసలీల వీడియోలో ఉన్న నటి రంజిత.. ఈమె ఇప్పుడు కైలాస రాజ్యానికి రాణిగా మారింది. ఆమెను పెళ్ళి చేసుకున్న నిత్యానంద స్వామి ప్రస్తుతం ఈక్వెడర్ లో ఉన్న కైలాసంలో ఆన్ లైన్ ద్వారా దర్శనం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ప్రజంట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now