Niharika Konidela : మెగా డాటర్ కొణిదెల నిహారికకు సినీ కెరీర్ పరంగా పెద్దగా కలిసి రాలేదు. దాదాపుగా సినిమాలకు దూరమైందనే అనుకున్నారు. పెళ్లికి ముందు కాస్తో కూస్తో సినిమాల్లో కనిపించినప్పటికీ పెళ్లి తరువాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ టీవీ షోలు, వెబ్ సిరీస్ లలో మాత్రం మెరుస్తూనే ఉంది. చైతన్యతో మ్యారేజ్ అయిన తరువాత తన స్టైల్ పూర్తిగా మారిపోయిందనే చెప్పవచ్చు. అలాగే పెళ్లయిన తరువాత కొద్ది రోజుల క్రితం వరకు కాస్త లావెక్కినట్టు కూడా కనిపించింది.
అయితే ఈ మధ్యన తన భర్తతో కలిసి జిమ్ కి వెళ్లడం కూడా స్టార్ట్ చేసిన నిహారిక మంచి ఫిజిక్ ను సాధించినట్లుగానే కనిపిస్తోంది. ఇక ఆమె భర్త చైతన్య లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వారిద్దరూ కలసి జిమ్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో నిహారిక తన షర్ట్ ను పైకి లేపి స్లిమ్ గా తయారైన తన నడుము, ఇంకా పొట్ట భాగాన్ని చూపెడుతూ పోజ్ ఇవ్వడం కనిపించింది. ఇక ఈ ఫోటోని గమనించినట్లైతే నిజంగా నిహారిక చాలా బరువు తగ్గినట్లుగానే తెలుస్తోంది. ఈ ఫోటోతో నిహారిక హాట్ నెస్ డోస్ ను కాస్త పెంచినట్లుగానే అనుకుంటున్నారు.
ఇక నిహారిక తాజా వెబ్ సిరీస్ హలో వరల్డ్ తో నిర్మాణ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ వెబ్ సిరీస్ ఈ మధ్యనే ఓటీటీ ప్లాటఫామ్ జీ5లో విడుదలైంది. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే నిహారిక ఇప్పుడు బిజీగా గడుపుతోంది. ఇక మెగా అభిమానులు సినిమాల్లో ఈమె రీ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…