Puri Jagannadh : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగానూ నిరాశపరిచింది. లైగర్ సినిమాకు ప్రీమియర్ షోల నుంచే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. లైగర్.. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ డై హార్డ్ ఫ్యాన్స్‌కే ఏ మాత్రం నచ్చడం లేదు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు పూరీకి వరుస ఫ్లాపులే ఉన్నాయి. ఆ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన పూరీ లైగర్‌తో దానిని కంటిన్యూ చేస్తాడనే అనుకున్నారు. కానీ రొటీన్ కథతో నిరాశ పరిచాడు. అయితే ఇప్పుడు లైగర్ తర్వాత వెంటనే పూరీ విజయ్‌తోనే జనగణమన సినిమా స్టార్ట్ చేసేశాడు. నిజానికి ఇది మహేష్‌బాబు కోసం రాసుకున్న కథ. మహేష్ ఆ స్టోరీని రిజెక్ట్ చేయడంతో విజయ్‌తో పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నాడు. విజయ్ లైగర్ రిజల్ట్ రాకుండానే పూరీతో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడు. కట్ చేస్తే లైగర్.. విజయ్, పూరీ కెరీర్ లోనే చెత్త సినిమాగా మిగిలిపోయింది.
లైగర్ సినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లు భారీగా నష్టపోవడం ఖాయమనే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ జనగణమన చేయడనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే పూరీకి గట్టి దెబ్బ తగిలినట్టే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విజయ్.. సమంతతో చేస్తోన్న ఖుషి మూవీని పూర్తి చేస్తూ జనగణమనకు బ్రేక్ ఇచ్చేసినట్టే అంటున్నారు. ఇక విజయ్ జనగణమన ఆపేయడం పూరీకి ఒక షాక్ అయితే.. ఇప్పటికే లైగర్ క్రేజ్ చూసి పూరీ నెక్స్ట్ బ్లాక్‌బస్టర్ ఇస్తాడని అడ్వాన్స్‌లు ఇచ్చినోళ్లు కూడా ఇప్పట్లో పూరీతో సినిమాలు చేసే ఛాన్స్ లేదు. ఏదేమైనా టెంపర్‌కు ముందు వరుస ఫ్లాపులు.. టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులతో పూరీని ఎవ్వరూ పట్టించుకోలేదో ఇప్పుడూ అదే పరిస్థితి వచ్చేలా ఉంది. మరి ముందు ముందు ఏమవుతుందో చూడాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…