Niharika Konidela : టైమెంత.. అడి అడిగిన నిహారిక.. పో.. పోవమ్మా.. అంటూ నెటిజన్ల కామెంట్స్‌..!

మే 30, 2022 9:51 సా.

Niharika Konidela : మెగా డాటర్‌ కొణిదెల నిహారిక ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను మళ్లీ యాక్టివేట్‌ చేసిన అనంతరం అందులో ఈమె వరుసగా పోస్టులు పెడుతోంది. ఈ మధ్యే భర్త చైతన్యతో కలిసి జోర్డాన్‌కు వెళ్లి వచ్చిన ఈమె అక్కడ పలు ప్రాంతాల్లో విహరించింది. ఎర్రని ఎండలో ఎరుపు రంగు దుస్తులను ధరించి ఈమె ఫొటోలకు పోజులు ఇచ్చింది. తరువాత ఓ చోట బహిరంగంగానే తన భర్తకు లిప్‌లాక్‌ ఇచ్చింది. దీంతో ఈ ఫొటోపై నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శలు చేశారు. ఇలాంటి ఫొటోలను ప్రయివేట్‌గా దాచుకోవాలి కానీ.. పబ్లిగ్గా షేర్‌ చేస్తారా.. అంటూ నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఇప్పుడు నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇంకో ఫొటోను షేర్‌ చేసింది. అయితే ఆ ఫొటోను షేర్‌ చేసిన ఆమె నెటిజన్లను ఓ ప్రశ్న కూడా అడిగింది.

నిహారిక తాజాగా ఓ ఫొటోను షేర్‌ చేసి దాంతోపాటు ఓ ప్రశ్న అడిగింది. ఆ ఫొటోలో ఉన్న నీడల ఆధారంగా టైమ్‌ ఎంత అవుతుందో చెప్పగలరా ? అంటూ ఆమె ప్రశ్న వేసింది. అయితే ఇందుకు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెబుతుండగా.. కొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు.

Niharika Konidela asked netizens for time they replied
Niharika Konidela

ఆమె అడిగినట్లుగా టైమ్‌ ఉదయం 10-11 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 2-3 గంటల మధ్య ఉంటుందని కొందరు బదులిచ్చారు. ఇక ఈ ఫొటోలో అద్భుతంగా ఉన్నావని ఇంకొందరు కామెంట్లు చేశారు. నీకు పనీ పాట ఏమీ లేదా.. అని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా నిహారిక ఈ మధ్యే డ్రగ్స్‌ కేసులో అరెస్టు అయిన విషయం విదితమే. తరువాత బెయిల్‌పై బయటకు వచ్చింది. అయితే నాగబాబు, ఆయన భార్య మాత్రం తమ కూతురికి ఏమీ తెలియదని అన్నారు. దీంతో నెటిజన్లు నాగబాబును ట్రోల్‌ చేశారు. నీ కుమార్తెకు ఏమీ తెలియకపోతే అర్థరాత్రి పూట తెలుగు సంవత్సరం రోజు భర్త లేకుండా ఒక పబ్‌లో ఏం చేస్తుంది.. ఉగాది పచ్చడి తినేందుకు వెళ్లిందా.. అంటూ నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇందుకు మాత్రం ఆయన బదులు చెప్పలేదు. ఇక నిహారిక త్వరలోనే ఓ ప్రముఖ చానల్‌లో ట్రావెల్‌ షోను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment