Niharika Konidela : మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌గా మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఎంతమంది ఉన్నా నటీమణులు మాత్రం నిహారిక ఒక్కతే. నిహారిక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. నిహారిక ఎక్కడ ఉన్నా ఫన్నీగా సెటైర్లు, అల్లరి చేష్టలు, క్యూట్ గా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. నాగబాబుకు తన కూతురు నిహారిక అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. నిహారిక కూడా తండ్రి పట్ల అమితమైన ప్రేమ చూపిస్తుంది. ఆ ప్రేమతోనే నిహారిక డాక్టర్ గా మారి నాగబాబుకు చుక్కలు చూపించింది.
కొన్నిరోజులుగా నాగబాబు తన కుడిచేతికి గాయంతో కనిపిస్తున్నారు. వరుణ్ తేజ్ కొత్త మూవీ లాంచ్ లో కూడా నాగబాబు గాయంతోనే కనిపించారు. నాగబాబు గాయంతో ఇబ్బంది పడుతుంటే నిహారిక అల్లరి మాత్రం తగ్గడం లేదు. తన తండ్రి చేతి నొప్పి పోగొట్టేందుకు నిహారిక.. డాక్టర్ నిహారికగా మారింది. నాన్న చేయి నొప్పిగా ఉందా అంటూ ప్రేమగా పక్కన కూర్చుంది. అవునమ్మా షోల్డర్ నుంచి కిందివరకు బాగా పెయిన్ గా ఉందని నాగబాబు సమాధానమిచ్చారు. నీ నొప్పిని నేను తీసేస్తా అని నిహారిక అనగా పెద్ద పెద్ద డాక్టర్ల వల్లే కాలేదు అని నాగబాబు అన్నారు.
ఏదైనా మంత్రం వేస్తావా ఏంటి అని అనగా.. నీ కెందుకు ఆ చేతికి ఉన్న నొప్పి తీసేస్తా అని.. రెండవ చేయి పట్టుకుని గట్టిగా కొరికేసింది. దీనితో నాగబాబు గట్టిగా అరిచారు. చూశారా ఆ చేయి నొప్పి తగ్గిపోయింది అని నిహారిక అనగా.. ఈ చేతికి వచ్చింది కదమ్మా అని సరదాగా అంటాడు. నిహారిక ఈ అల్లరి చేష్టలని నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ముల్లుని ముల్లుతోనే తీయడం అంటే ఇదేనేమో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మీ ఇంట్లో ట్రై చేయొద్దు. ఇది డాక్టర్ నిహారిక పర్యవేక్షణలో జరిగింది అని నాగబాబు ఫన్నీ కామెంట్ పెట్టారు. నాగబాబు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు మెగా అభిమానులు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…