Kangana Ranaut : కంగ‌నా ర‌నౌత్‌పై భారీగా ట్రోలింగ్.. ఎగిరెగిరి ప‌డ్డావు.. ఇప్పుడేమైంది.. అని కామెంట్స్‌..!

Kangana Ranaut : కంగ‌నా ర‌నౌత్‌.. ఈ పేరు చెప్ప‌గానే మ‌నకు వివాదాలే ఎక్కువ‌గా గుర్తుకు వ‌స్తాయి. ఈమె సినిమాల క‌న్నా వివాదాల‌తోనే ఎక్కువ పాపుల‌ర్ అయింద‌న్న విష‌యం తెలిసిందే. ఈమె ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా వివాదాస్ప‌దం అవుతుంటుంది. అయితే కంగ‌నా ర‌నౌత్ గ‌త 2 రోజుల నుంచి భారీ స్థాయిలో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. ఈమెను నెటిజ‌న్లు తెగ విమ‌ర్శిస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే అందుకు కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే..

కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌ల న‌టించిన చిత్రం.. ధాక‌డ్‌.. ఈ మూవీలో దివ్యా ద‌త్తా, అర్జున్ రామ్‌పాల్ వంటి వారు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీ మే 20వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్ష‌కులు అసలు ఏమాత్రం ఆస‌క్తిని చూపించ‌డం లేదు. దీంతో తొలి రోజు నుంచే 80 శాతానికి పైగా థియేట‌ర్లు ఖాళీగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే న‌ష్టాల‌తో థియేట‌ర్ల‌ను ర‌న్ చేయ‌లేరు.. క‌నుక థియేట‌ర్ల యాజ‌మాన్యాలు ధాక‌డ్ సినిమాను తీసేసి వేరే సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. దీంతో కంగ‌నా ర‌నౌత్‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైన‌ట్లు అయింది.

Kangana Ranaut

ఇప్ప‌టి వ‌ర‌కు కంగ‌నా న‌టించిన ఏ సినిమా కూడా ఇంత‌టి ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకోలేదు. కాస్తో కూస్తో ఆడింది. కానీ ధాక‌డ్ మాత్రం అత్యంత అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే అనేక థియేట‌ర్ల‌లో ఈ సినిమాను తీసేసి వేరే సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో నెటిజన్ల‌కు ఒక ఆయుధం ల‌భించిన‌ట్లు అయింది. ముఖ్యంగా కంగ‌నా అంటే మండిప‌డేవారు ఇప్పుడు ఆమెపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. ఆమెను భారీ ఎత్తున ట్రోల్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు.

కంగ‌నా ర‌నౌత్ అస‌లు భూమిపై నిల‌బ‌డ‌లేద‌ని.. ఎంతో పొగ‌రుగా ఉండేద‌ని.. అయితే ఆమెకు ఉన్న పొగ‌రు, అహంకారం అన్నీ క‌రిగిపోయాయి.. అంటూ చాలా మంది నెటిజ‌న్లు ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగ‌నా ఇలాంటి ఓట‌ముల‌కు భ‌య‌ప‌డ‌ద‌నే విష‌యం తెలుసు. మ‌రి ఆమె రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాల‌తో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM