Chiranjeevi : చిరంజీవిది ఐర‌న్ లెగ్‌.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

Chiranjeevi : టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అని అడిగితే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆయన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నారు. పునాదిరాళ్లు చిత్రంతో చిరంజీవి తన కెరీర్ ని స్టార్ట్ చేసి దాదాపు 150 చిత్రాలకు పైగా నటించి సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా తెలుగు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.

రాజకీయాల కారణంగా చిత్రాలకి ఇక దూరంగా ఉంటారు అనుకునే ఉద్దేశంతో ఉన్న ప్రజల అంచనాలను తారుమారు చేస్తూ ఖైదీ నెంబర్ 150 చిత్రంతో తిరిగి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎంతో స్టార్ డమ్ ఉన్న  మెగాస్టార్ రీ ఎంట్రీ  ఇచ్చిన తర్వాత వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. ఆయనకు ఈ మధ్య కష్టకాలం నడుస్తుంది అంటూ స్వయంగా ఆయన అభిమానులే కామెంట్ చేస్తున్నారు.

Chiranjeevi

దాదాపు రెండు సంవత్సరాలు ఎదురు చూసిన ఆచార్య చిత్రం ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలు చవి చూపించింది. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ కొరటాల శివ కూడా తన ఆస్తులు అమ్ముకునే స్థితికి వచ్చేశారు. బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దాని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేసిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్, నాగచైతన్య కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా దారుణమైన రిజల్ట్ అందుకుంది. ఆచార్య చిత్రం డిజాస్టర్ నుంచి తేరుకోకముందే లాల్ సింగ్ చద్దా చిత్రం రిజల్ట్ కూడా ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టింది.

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పాల్గొన్నారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ల‌కి పాల్గొన్న చిత్రాలన్నీ ఫ్లాపులను అందుకోవడంతో మెగాస్టార్ కి బ్యాడ్ టైం నడుస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతోపాటు కొంద‌రైతే ఏకంగా ఆయ‌న‌ను ఐర‌న్ లెగ్ అని అంటున్నారు. అయితే త్వ‌ర‌లో ఆయ‌న న‌టించిన గాడ్ ఫాద‌ర్ రిలీజ్ కానుంది. మ‌రి ఈ మూవీ ఎలా అల‌రిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM