Manchu Manoj : డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మనోజ్ గురించి పరిచయం అక్కర్లేదు. భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్‌కు ఇదివరకే హైదరాబాద్‌కు చెందిన ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. 2015లో వీరి వివాహం కాగా.. ఈ జంట 2019లో విడిపోయారు. అప్పటి నుంచి మనోజ్ సింగిల్‌గానే ఉంటున్నాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి.. అహం బ్రహ్మస్మి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. వారిద్దరు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో భూమా మౌనికా రెడ్డి, మంచు మనోజ్‌లు పెళ్ళి చేసుకుబోతున్నట్టు వస్తున్న వార్తలకు బలం చేకూరింది. దీంతో ఇప్పుడు ఇటు చిత్రపరిశ్రమలోనూ, అటు రాజకీయరంగంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఇక భూమా నాగిరెడ్డి దంపతుల మరణానంతరం అక్క అఖిలకు చేదోడు వాదోడుగా మారింది భూమా మౌనికా రెడ్డి.
ఇటు మంచు మనోజ్‌కీ, అటు భూమా మౌనికా రెడ్డికీ గతంలో వేర్వేరుగా వివాహాలు జరిగాయి. ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహబంధం ఉంది. భూమా దంపతుల మరణానంతరం వీరి బంధం మరింత బలపడింది. తరచూ మంచు మనోజ్ భూమా కుటుంబంలోని కీలక సందర్భాల్లో కనిపిస్తూ ఉండేవాడు. ఆపదలో ఉన్న ప్రతిసారీ మంచు ప్రసెన్స్ భూమా ఇంట ఉండేది. అదే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించడానికి కారణమై ఉంచొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ దృశ్యాలు మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డిల వివాహాన్ని ఖరారు చేశాయి. సందర్భమొచ్చినప్పుడు తామే చెపుతామని మంచు మనోజ్ మీడియాకు చెప్పారు. ఇక మంచువారి ఇంట పెళ్ళి సందడి ఎప్పుడు మొదలవుతుందో ఎదురు చూడాల్సిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…