Nagarjuna : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సమానంగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంత చేసుకున్నాడు. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలమే అయినప్పటికీ యంగ్ లుక్స్ తో కొడుకులకే పోటీ ఇస్తూ.. యంగ్ హీరోలకి కూడా తనదైన స్టైల్ లో దీటుగా సమాధానం ఇస్తున్నాడు. అయితే నాగార్జున ముందుగా దివంగత లెజెండ్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగార్జున సినిమాల్లోకి రావడానికి ముందే శ్రీలక్ష్మితో వివాహమైంది. అప్పటికే ఈ దంపతులకు నాగచైతన్య జన్మించాడు.
ఆ తర్వాత శ్రీలక్ష్మితో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న నాగార్జున.. తనతో పాటు శివ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అందరికీ అమల అంటే గౌరవం, ప్రేమ. అందరితోనూ కలివిడిగా కలిసిపోయి వినయంగా ఉంటుంది. నిజానికి ప్రేమించిన వ్యక్తి కోసం తనని తాను చాలా మార్చుకుంది అమల. అలాగే నాగార్జునకు అమల అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పటికీ అన్యోన్యంగా ఉంటారు. అయితే పెళ్లయిన కొత్తలో అమల నాగార్జునకు ఓ మాట చెప్పిందట. ఆ పని కచ్చితంగా చేసి తీరాల్సిందే అంటూ ప్రామిస్ చేయించుకుందట. ఆశ్చర్యం ఏంటంటే.. పెళ్లి అయ్యి ఇన్నాళ్లయినా కూడా నాగార్జున ఇప్పటికీ ఆ పని ఇంకా చేస్తూనే ఉన్నాడట.
ఇంతకీ ఆ పని ఏంటంటే.. అమల జంతు ప్రేమికురాలు.. అందుకోసం బ్లూ క్రాస్ ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. జంతువులకు ఏదైనా అయితే అమలు చూసి తట్టుకోలేదు. అందుకే అమల తన సంపాదనలో కొంత భాగం జంతువుల సంరక్షణ కోసం ఇస్తుంది. అదే విధంగా నాగార్జునను కూడా ఏటా తన సంపాదనలో కొంత జంతువుల సంరక్షణకు ఇవ్వాలని కండిషన్ పెట్టిందట. దానికి ఓకే చెప్పిన నాగార్జున ఇప్పటికీ ఏటా తన సంపాదనలో కొంత అమౌంట్ ఇస్తున్నాడట. ఈ విషయం తెలిసిన అభిమానులు అమలపై నాగార్జునకు ఎంత ప్రేమ ఉందో అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే నాగ్ సర్ ది గొప్ప మనసు అని అభినందిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…