Ram Charan : దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆయన వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమస్ అయిపోయారు. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఆయకు హాలీవుడ్ నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అంతేకాకుండా యాడ్స్‌లో నటించే అవకాశాలు కూడా పెరిగిపోయాయి. చరణ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ఆయన ఇంటి ముందుకు క్యూ కడుతున్నాయి. ఒక యాడ్ కి రామ్ చరణ్ కి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు.
తాజాగా రామ్ చరణ్ హీరో బైక్ యాడ్ చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఆ యాడ్‌కు సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. మరి కొద్ది రోజుల్లో హీరో బైక్ యాడ్ తో రామ్ చరణ్ జనాల ముందుకు రాబోతున్నారు. ఈ హీరో బైక్ యాడ్‌లో నటించటానికి రామ్ చరణ్ భారీగా ఛార్జ్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఈ యాడ్ కోసం రామ్ చరణ్ 7 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ గా ఎంతో మంచి క్రేజ్ వున్న రామ్ చరణ్ కి రూ.7 కోట్లు ఆఫర్ అనేది చాలా తక్కువ అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ఆర్‌సి15 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం డైరెక్టర్ శంకర్ కి ప్రొడ్యూసర్ దిల్ రాజుకి 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అనే విషయాలు వెల్లడవుతున్నాయి. డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ గా తెలుగులో తీస్తున్న మొదటి చిత్రం ఇది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…