Mokshagna : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. ఇప్పటికే అక్కినేని, మెగా, అల్లు, ఘట్టమనేని ఫ్యామిలీల నుంచి నట వారసులు వచ్చి స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఆ జనరేషన్ వారిలో బాలయ్య ఒక్కడే ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు.
అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయం పై ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తున్నాడు బాలయ్య. అయితే ఆదిత్య 369 సీక్వెల్ ను మోక్షజ్ఞతో తెరకెక్కిస్తానని.. కుదిరితే దానికి తానే దర్శకత్వం వహిస్తానని ఇటీవల బాలయ్య అన్నాడు. కానీ తర్వాత ఎప్పటిలాగే క్రిష్, బోయపాటి, కొరటాల, రాజమౌళి పేర్లు వినిపించాయి. తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ ఎంట్రీకి నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాకి దర్శకత్వం వహించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.
వారాహి చలన చిత్రం బ్యానర్ పై బాలయ్యకు, రాజమౌళికి అత్యంత సన్నిహితుడు అయిన సాయి కొర్రపాటి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారట. ఇక మోక్షజ్ఞ తొలి సినిమా సాఫ్ట్ ప్రేమ కథతో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ప్రేమించి చూడు అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలో బాలయ్య అధికారిక ప్రకటన చేయనున్నాడు. ఈ ప్రకటన వస్తే నందమూరి అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…