Urfi Javed : హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తాను ధరించే దుస్తుల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఈమె ఒకసారి ధరించిన డ్రెస్‌ను మళ్లీ ధరించదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రెస్‌లను ధరిస్తూ ఉంటుంది. క్రియేటివిటీని అంతా తన దుస్తుల్లో చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా మరోమారు ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది. కారణం ఆమె ధరించిన డ్రెస్సే అని చెప్పవచ్చు. ఒక గోనెసంచిని కట్ చేసి ఒంటికి చుట్టుకుంది. అనంతరం ఫొటోలు దిగి వాటిని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.
వేసుకునేందుకు నీకు దుస్తులు లేవా.. ఇంత దిక్కుమాలిన, ఛండాలమైన డ్రెస్సులను ఎందుకు ధరిస్తున్నావు.. ఒంటికి గోనె సంచి చుట్టుకుంటావా.. సిగ్గులేదా.. అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఉర్ఫి జావెద్ తన డ్రెస్సింగ్ స్టైల్‌పై గతంలోనే క్లియర్ గా చెప్పేసింది. తాను తనకు నచ్చినట్లు, తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటానని.. తనకు నచ్చిన డ్రెస్సులను ధరిస్తానని.. తనను ఎవరు ఏమన్నా పట్టించుకోనని చెప్పేసింది. కనుక ఎన్ని విమర్శలు వచ్చినా అలాంటి డ్రెస్‌లను ధరించడం ఆమె ఆపదని తెలుస్తోంది.
ఇక ఉర్ఫి జావెద్ చివరిసారిగా ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. సింగర్ కున్వార్ రూపొందించిన ఆ వీడియోలో ఆమె అలరించింది. అలాగే బడే భయ్యా కీ దుల్హనియా, మేరీ దుర్గా, బేపన్నా, పంచ్ బీట్ సీజన్ 2 వంటి టీవీ షోలలోనూ యాక్ట్ చేసింది. అలాగే యే రిష్తా క్యా కెహ్లాతా హై, కసౌతీ జిందగీ కే 2 వంటి సీరియల్స్‌లోనూ నటించింది. కానీ ఈమె తాను ధరించే డ్రెస్‌ల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…