Urfi Javed : ఏం దొరకనట్లు ఒంటికి గోనె సంచులు చుట్టుకుంది.. ఇదేందిది..?

June 5, 2022 7:26 AM

Urfi Javed : హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్‌ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తాను ధరించే దుస్తుల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఈమె ఒకసారి ధరించిన డ్రెస్‌ను మళ్లీ ధరించదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రెస్‌లను ధరిస్తూ ఉంటుంది. క్రియేటివిటీని అంతా తన దుస్తుల్లో చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు ఎప్పుడూ వైరల్‌ అవుతుంటాయి. అయితే తాజాగా మరోమారు ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది. కారణం ఆమె ధరించిన డ్రెస్సే అని చెప్పవచ్చు. ఒక గోనెసంచిని కట్‌ చేసి ఒంటికి చుట్టుకుంది. అనంతరం ఫొటోలు దిగి వాటిని షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.

వేసుకునేందుకు నీకు దుస్తులు లేవా.. ఇంత దిక్కుమాలిన, ఛండాలమైన డ్రెస్సులను ఎందుకు ధరిస్తున్నావు.. ఒంటికి గోనె సంచి చుట్టుకుంటావా.. సిగ్గులేదా.. అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఉర్ఫి జావెద్‌ తన డ్రెస్సింగ్‌ స్టైల్‌పై గతంలోనే క్లియర్ గా చెప్పేసింది. తాను తనకు నచ్చినట్లు, తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటానని.. తనకు నచ్చిన డ్రెస్సులను ధరిస్తానని.. తనను ఎవరు ఏమన్నా పట్టించుకోనని చెప్పేసింది. కనుక ఎన్ని విమర్శలు వచ్చినా అలాంటి డ్రెస్‌లను ధరించడం ఆమె ఆపదని తెలుస్తోంది.

netizen comments on Urfi Javed for her latest post
Urfi Javed

ఇక ఉర్ఫి జావెద్‌ చివరిసారిగా ఓ మ్యూజిక్‌ వీడియోలో కనిపించింది. సింగర్‌ కున్వార్‌ రూపొందించిన ఆ వీడియోలో ఆమె అలరించింది. అలాగే బడే భయ్యా కీ దుల్హనియా, మేరీ దుర్గా, బేపన్నా, పంచ్‌ బీట్‌ సీజన్‌ 2 వంటి టీవీ షోలలోనూ యాక్ట్‌ చేసింది. అలాగే యే రిష్తా క్యా కెహ్లాతా హై, కసౌతీ జిందగీ కే 2 వంటి సీరియల్స్‌లోనూ నటించింది. కానీ ఈమె తాను ధరించే డ్రెస్‌ల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment