Niharika Konidela : అది చాలా టాప్ సీక్రెట్ అన్న నిహారిక‌.. ఇంత‌కీ ఏమిట‌ది..?

June 7, 2022 8:36 PM

Niharika Konidela : మెగా డాట‌ర్ నిహారిక ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె డ్ర‌గ్స్ కేసు వ‌ల్ల చాలా రోజులపాటు ఇంటికే ప‌రిమితం అయింది. త‌రువాత అనూహ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వ‌చ్చింది. గ‌తంలో ఈమె ప‌లు కార‌ణాల వల్ల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేసింది. కానీ డ్ర‌గ్స్ కేసు అనంత‌రం కొన్ని రోజులు అయ్యాక తిరిగి ఇన్‌స్టాలోకి వ‌చ్చింది. ఇక ఈమె త‌న లుక్‌ను కూడా పూర్తిగా మార్చేసింది. అలాగే ఎప్ప‌టిలాగే జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ కూడా చేస్తోంది.

త‌న భ‌ర్త చైత‌న్య‌తో ఈ మధ్యే జోర్డాన్‌కు వెకేష‌న్‌కు వెళ్లి కూడా వ‌చ్చింది. అయితే నిహారిక ఇది వ‌ర‌కే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాన‌ని చెప్పింది. అంటే గ‌తంలో మాదిరిగా వెబ్ సిరీస్‌లు, యాంక‌ర్‌గా షోలు చేస్తుంద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చింద‌న్న‌మాట‌. అందులో భాగంగానే రానా స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న 777 చార్లీ అనే మూవీ కోసం నిహారిక ప‌నిచేస్తోంది. ఇక ఈ మూవీకి ప్ర‌మోష‌న్ క‌ల్పించ‌డం కోసం నిహారిక తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ సెష‌న్ నిర్వ‌హించింది. అందులో భాగంగా త‌న ఫాలోవ‌ర్లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది.

netizen asked Niharika Konidela her phone number what she replied
Niharika Konidela

ఒక నెటిజ‌న్ నువ్వు సింగిలేనా.. అని అడ‌గ్గా.. త‌న భ‌ర్త‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నానంటారా.. అని ఎదురు ప్ర‌శ్న వేసింది. ఇక ఇంకో నెటిజ‌న్ నిహారిక‌ను ఆమె ఫోన్ నంబ‌ర్ కావాల‌ని అడ‌గ్గా.. హుష్ అది టాప్ సీక్రెట్‌.. బ‌య‌ట‌కు చెప్ప‌కూడ‌దు.. అని బ‌దులిచ్చింది. ఇలా నిహారిక నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు ఫ‌న్నీగా స‌మాధానాలు చెప్పింది. అయితే నిహారిక త్వ‌ర‌లోనే ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో ట్రావెల్ షో నిర్వ‌హిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం త్వ‌ర‌లోనే తేలనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment