Shilpa Shetty : తెలుగుతోపాటు పలు ఇతర భాషల చిత్రాల్లోనూ నటించి బాలీవుడ్ లో సెటిల్ అయిన ముద్దుగుమ్మ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ఓ ఫిట్‌నెస్ సంస్థతో కలిసి యోగా చేస్తూ ఆ వీడియోల ద్వారా డబ్బులను బాగానే సంపాదిస్తోంది. అయితే అంతా బాగానే సాగిపోతోంది అనుకుంటున్న తరుణంలో ఆమె భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు అయ్యాడు. గొప్ప వ్యాపారవేత్త, ధనికుడు అయి ఉండి కూడా కాసులకు కక్కుర్తి పడి అలాంటి చిత్రాలను తీసి అభాసు పాలయ్యాడు. అయితే ఈ షాక్ నుంచి శిల్పా ఇప్పుడిప్పుడే బయట పడుతూ మళ్లీ బయటి ప్రపంచంలోకి వస్తోంది.
ఇక శిల్పాశెట్టి లేటెస్ట్ మూవీ నికమ్మా ట్రైలర్ ఇటీవలే లాంచ్ అయింది. ఈ లాంచింగ్ ఈవెంట్‌కు హాజరైన శిల్పా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ వండర్ వుమన్‌ను పోలిన డ్రెస్ ధరించి ఆశ్చర్య పరిచింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈమె ధరించిన డ్రెస్ చూపరులను తల తిప్పుకోనీయలేదు. అయితే ఈమె అలాంటి డ్రెస్ ధరించినందుకు గాను నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో వండర్ వుమన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో.. అలా శిల్పా ఈ డ్రెస్‌ను ధరించిందని అంటున్నారు. ఆమె భర్త అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు కావడంతో పనిలో పనిగా ఆ విషయాన్ని మళ్లీ బయటకు తెచ్చి కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఇక శిల్పా శెట్టి ధరించిన ఈ డ్రెస్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఫొటోలపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కాగా నికమ్మా మూవీ వచ్చే జూన్ 17వ తేదీన రిలీజ్ కానుండగా.. ఇందులో కమెడియన్ సునీల్ గ్రోవర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దీన్ని సోనీ పిక్చర్స్ నిర్మించి సమర్పిస్తోంది. షబ్బీర్ ఖాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…