Shilpa Shetty : పొడుగు కాళ్ల సుంద‌రి శిల్పా శెట్టిపై దారుణ‌మైన ట్రోల్స్‌..!

May 19, 2022 11:25 AM

Shilpa Shetty : తెలుగుతోపాటు ప‌లు ఇత‌ర భాష‌ల చిత్రాల్లోనూ న‌టించి బాలీవుడ్ లో సెటిల్ అయిన ముద్దుగుమ్మ శిల్పా శెట్టి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్మ‌డు ఓ ఫిట్‌నెస్ సంస్థ‌తో క‌లిసి యోగా చేస్తూ ఆ వీడియోల ద్వారా డ‌బ్బుల‌ను బాగానే సంపాదిస్తోంది. అయితే అంతా బాగానే సాగిపోతోంది అనుకుంటున్న త‌రుణంలో ఆమె భ‌ర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు అయ్యాడు. గొప్ప వ్యాపార‌వేత్త‌, ధ‌నికుడు అయి ఉండి కూడా కాసుల‌కు క‌క్కుర్తి ప‌డి అలాంటి చిత్రాల‌ను తీసి అభాసు పాలయ్యాడు. అయితే ఈ షాక్ నుంచి శిల్పా ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతూ మ‌ళ్లీ బ‌య‌టి ప్ర‌పంచంలోకి వస్తోంది.

ఇక శిల్పాశెట్టి లేటెస్ట్ మూవీ నిక‌మ్మా ట్రైల‌ర్ ఇటీవ‌లే లాంచ్ అయింది. ఈ లాంచింగ్ ఈవెంట్‌కు హాజ‌రైన శిల్పా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. హాలీవుడ్ వండ‌ర్ వుమ‌న్‌ను పోలిన డ్రెస్ ధ‌రించి ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఈమె ధ‌రించిన డ్రెస్ చూప‌రుల‌ను త‌ల తిప్పుకోనీయ‌లేదు. అయితే ఈమె అలాంటి డ్రెస్ ధ‌రించినందుకు గాను నెటిజ‌న్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో వండ‌ర్ వుమ‌న్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో.. అలా శిల్పా ఈ డ్రెస్‌ను ధ‌రించిందని అంటున్నారు. ఆమె భ‌ర్త అశ్లీల చిత్రాల కేసులో అరెస్టు కావ‌డంతో ప‌నిలో ప‌నిగా ఆ విష‌యాన్ని మ‌ళ్లీ బ‌య‌ట‌కు తెచ్చి కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

netizen angry on Shilpa Shetty for her latest photos
Shilpa Shetty

ఇక శిల్పా శెట్టి ధ‌రించిన ఈ డ్రెస్ తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆ ఫొటోల‌పై నెటిజ‌న్లు భిన్న‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. కాగా నిక‌మ్మా మూవీ వ‌చ్చే జూన్ 17వ తేదీన రిలీజ్ కానుండ‌గా.. ఇందులో క‌మెడియ‌న్ సునీల్ గ్రోవ‌ర్ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. దీన్ని సోనీ పిక్చ‌ర్స్ నిర్మించి స‌మ‌ర్పిస్తోంది. ష‌బ్బీర్ ఖాన్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now