Sherlyn Chopra : శిల్పా శెట్టి దంపతులకు షాక్ ఇచ్చిన షెర్లిన్ చోప్రా.. ఏకంగా రూ.75 కోట్ల పరిహారం..!

October 28, 2021 8:53 PM

Sherlyn Chopra : అశ్లీల చిత్రాలను తీస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న కేసులో భాగంగా ముంబై పోలీసులు నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శిల్పా శెట్టి దంపతులపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గాను వారి పరువుకు భంగం కలుగుతుందని భావించిన శిల్పాశెట్టి దంపతులు షెర్లిన్ చోప్రాపై పరువునష్టం కేసు వేయడమే కాకుండా బహిరంగంగా క్షమాపణలు చెప్పి రూ.50 కోట్లను నష్ట పరిహారంగా చెల్లించాలని కోర్టులో పిటిషన్ వేశారు.

Sherlyn Chopra filed rs 75 crore defamation suit on shilpa shetty couple

కాగా లీగల్ నోటీసు అందుకున్న షెర్లిన్ చోప్రా తనదైన శైలిలో సమాధానం చెబుతూ శిల్పాశెట్టి దంపతులకు షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే షెర్లిన్ చోప్రా స్పందిస్తూ తాను చేస్తున్న న్యాయపోరాటాన్ని అడ్డుకోవడం కోసం డిఫేమేషన్ సూట్‌ను ఓ అస్త్రంగా వాడుకొని శిల్పాశెట్టి దంపతులు.. అండర్ వరల్డ్ మాఫియాతో తనను బెదిరిస్తున్నారని పేర్కొంది.

అండర్ వరల్డ్ మాఫియాతో తనను బెదిరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న శిల్పాశెట్టి దంపతులు రూ. 75 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని షెర్లిన్ చోప్రా శిల్పాశెట్టి దంపతులకు షాప్ కౌంటర్ వేసింది. శిల్పా శెట్టి దంపతుల బెదిరింపులకు తాను భయపడనని.. అయితే పోలీసులు ముందుగా తన కేసు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా పోలీసులను వేడుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now