Shilpa Shetty : ఆ నటిపై పరువు నష్టం దావా వేసిన కుంద్రా దంపతులు..!

October 20, 2021 10:46 PM

Shilpa Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కంటెంట్ ఉన్న చిత్రాలను తీస్తున్నారన్న ఆరోపణల కారణంగా అతనిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ శృంగార తార షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా దంపతులపై అనేక ఆరోపణలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కుంద్రాపై షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Shilpa Shetty and raj kundra filed rs 50 crores of defamation suit on sherlyn chopra

రాజ్‌ కుంద్రా తనను లైంగికంగా వేధిస్తున్నాడని అనేక ఆరోపణలు చేస్తూ షెర్లిన్‌ చోప్రా ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తమ గురించి లేనిపోని తప్పుడు స్టేట్మెంట్లను ఇస్తూ మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా చేస్తుందని ఆరోపిస్తూ ఆమెపై శిల్పా శెట్టి దంపతులు పరువు నష్టం దావా వేశారు.

ఈ క్రమంలోనే శిల్పాశెట్టి లాయర్ కోర్టులో పరువు నష్టం దావా ఏకంగా రూ.50 కోట్లు వేయడంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో శృంగార తారగా ఎంతో పేరు సంపాదించుకున్న షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం శిల్పా శెట్టి దంపతులు ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now