Manchu Vishnu : స‌న్నీ లియోన్‌తో ఆ స‌ర‌సాలు ఏమిటి.. మంచు విష్ణుపై విమ‌ర్శ‌లు.. వీడియో వైర‌ల్‌..!

April 21, 2022 2:50 PM

Manchu Vishnu : క‌లెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు న‌ట‌వార‌సులుగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యారు మంచు విష్ణు, మ‌నోజ్. ఈ ఇద్ద‌రూ ప‌లు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని పెద్దగా అల‌రించ‌లేక‌పోయారు. అయితే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా మంచు విష్ణు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం సూర్య అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే పాత్రను పోషిస్తున్నారు విష్ణు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో సన్నీలియోన్ రేణుక అనే పాత్రలో నటిస్తోంది.

netizen angry on Manchu Vishnu for his latest post
Manchu Vishnu

షూటింగ్ సంగ‌తేమో కానీ స‌న్నీలియోన్‌తో విష్ణు చేస్తున్న సంద‌డి మాములుగా ఉండ‌డం లేదు. ఇటీవ‌ల ఓ వీడియో పోస్ట్ చేయ‌గా అందులో స‌న్నీలియోన్‌.. మంచు విష్ణుని భ‌య‌పెట్టిస్తున్న‌ట్టుగా క‌నిపించింది. మాస్కుతో ఆమె భ‌య‌పెట్టినా భ‌య‌ప‌డ‌ని విష్ణు.. ఫేస్ మాస్కుతీసేయ‌గానే భ‌య‌ప‌డ్డాడు. బ్యాక్ గ్రౌండ్ లో చూపే బంగారమాయేనే శ్రీవల్లి.. పాట పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇక తాజాగా స‌న్నీ లియోన్.. మంచు విష్ణు ఇంట్లో ప‌రోటాలు చేసింది. త‌న కిచెన్ లో స‌న్నీలియోన్ త‌న కోసం ప‌రోటాలు చేస్తుందంటూ విష్ణు వీడియోను షేర్ చేశాడు.

వీడియోలో స‌న్నీ లియోన్, మంచు విష్ణు ఇద్ద‌రూ ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటున్నారు. ప‌రోటా చేయ‌డంలో మెలుకువ‌లు కూడా నేర్పిస్తున్నాడు విష్ణు. అయితే స‌న్నీ లియోన్ వీపుపై ఆమ్లెట్ కూడావేయొచ్చు అని మంచు విష్ణు కామెంట్ చేయ‌డంతో ఇప్పుడు ఆయ‌న‌ని తెగ ఆడేసుకుంటున్నారు. గ‌తంలోనూ విష్ణుపై తెగ ట్రోలింగ్ న‌డిచిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా గాలి నాగేశ్వ‌ర‌రావు చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ కథానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చిత్ర బృందం చెబుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment