Anchor Suma : యాంక‌ర్ సుమ‌పై నెటిజ‌న్ల తీవ్ర ఆగ్ర‌హం.. ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు పెడుతుందా..?

August 18, 2022 7:15 AM

Anchor Suma : రెండు దశాబ్దాలుగా అటు బుల్లితెరను ఏలుతూ, ఇటీవలే జయమ్మ పంచాయితీ అంటూ మరోసారి వెండితెరపైకి అడుగు పెట్టింది యాంకర్ సుమ కనకాల. అటు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ చేస్తుంటుంది సుమ. సుమ సినిమా ఈవెంట్‌ని హోస్ట్ చేస్తుందంటే ఆ సందడే వేరు. అందరినీ ఈవెంట్ లో భాగస్వామ్యం చేస్తూ.. కడుపుబ్బా నవ్విస్తుంది. ఒకరకంగా సుమ కోసమే కొందరు ఈవెంట్ చూస్తారు అంటే నమ్మశక్యం కాదు. పైగా సుమ వివాదాలకు చాలా దూరంగా ఉంటూ హీరోలందరితోనూ సత్సంబంధాలను కలిగి ఉంటుంది. అయితే ఇటీవల ఓ వివాదం సుమ మెడకు చుట్టుకుంది. అదేంటంటే..

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ క్రెడిట్ కు సంబంధించి చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి అభిమానులు క్రెడిట్ మాదంటే మాదని సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం చేస్తున్నారు. అయితే తాజాగా ఆస్కార్ ఆశించే 2023 నామినీ నటుల జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా ఉందని వార్తలు వచ్చాయి. ఇందులో రామ్ చరణ్ పేరు ఎక్కడా కనిపించలేదు. అంతర్జాతీయ మ్యాగజైన్ వెరైటీ 2023 ఆస్కార్ నామినీల జాబితాను విడుదల చేసింది. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు తారక్, చరణ్ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ మళ్లీ మొదలైంది.

netizen angry on Anchor Suma for creating quarrels
Anchor Suma

ఇదిలా ఉండగా యాంకర్ సుమ తన గేమ్ షో లో అడిగిన ఓ ప్రశ్న అభిమానుల మధ్య విద్వేషాలు సృష్టించేదిగా మారింది. సుమ తన క్యాష్ ఎపిసోడ్‌లో సీనియర్ నటి అన్నపూర్ణమ్మను ఏ నటుడి నటన మిమ్మల్ని గర్వపడేలా చేసింది ? ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్.. అని అడగ్గా.. అన్నపూర్ణమ్మ ఏ మాత్రం తడబడకుండా.. అసలు ఎన్టీఆర్..! చరణ్ కూడా మంచి సపోర్ట్‌గా ఉన్నాడు.. అని చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఈ వీడియోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో ఇది ఇరువర్గాల అభిమానుల మధ్య గొడవలకు దారితీసింది. సుమ వివాదాలు సృష్టించే ఉద్దేశంతో ఆ ప్రశ్న అడగనప్పటికీ ఆల్రెడీ సెన్సిటివ్ గా ఉన్న ఇష్యూపై ప్రశ్నలు వేయడం ఏంటని మరికొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చూడాలి దీనికి సుమ ఏ విధంగా స్పందిస్తుందో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment