Nayanthara : తన అందం, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఏంటో చెప్పేసిన నయనతార..!

June 2, 2022 8:14 AM

Nayanthara : నయనతార సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 20 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ చెక్కు చెరగని అందం ఆమె సొంతం. అలాగే ఆమె ఇప్పటికీ ఆఫర్లను అందుకుంటూ వస్తోంది. అయితే గ్లామర్‌ షోకు బైబై చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ పాత్రలలో నటించేందుకే ఎక్కువ మొగ్గు చూపుతోంది. ఈమధ్యే ఈమె కాతువాకుల రెండు కాదల్‌ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ తెలుగులో ఫ్లాప్‌ కాగా.. తమిళంలో హిట్‌ అయింది. ఇక ఇన్నేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో అనేక లేడీ ఓరియెంటెడ్‌ పాత్రల్లో నటించినందుకు గాను ఈమె లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. అయితే నయనతార ఇన్నేళ్లయినా అందం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇక ఆమె అందం, డైట్‌ సీక్రెట్‌ ఏమిటి.. అనే విషయానికి వస్తే..

నయనతార ఇటీవల తన అందం, డైట్‌ సీక్రెట్స్‌ ఏంటో చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను వెయిట్‌ ట్రెయినింగ్‌ ఎక్కువగా చేస్తానని.. అలాగే యోగా తప్పనిసరి అని తెలియజేసింది. రోజంతా డీహైడ్రేషన్‌ బారిన పడకుండా చల్లగా కూల్‌ కూల్‌గా ఉండేందుకు కొబ్బరినీళ్లను ఎక్కువగా తాగుతానని చెప్పింది. దీంతోపాటు చక్కెరను అసలు తీసుకోనని, పండ్లను అధికంగా తింటానని తెలియజేసింది.

Nayanthara told important things about her fitness
Nayanthara

అలాగే తక్కువ తిను.. ఎక్కువగా పనిచేయి.. అన్న సూత్రాన్ని తాను పాటిస్తానని నయనతార తెలియజేసింది. అందువల్లే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని చెప్పింది. ఇక నయనతార ప్రస్తుతం ఓ2 అనే తమిళ మూవీలో నటిస్తుండగా.. ఇది పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. అలాగే మళయాళంలో గోల్డ్‌ అనే మూవీ చేస్తోంది. ఇది కూడా షూటింగ్‌ కంప్లీట్‌ అయి పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఇక హిందీలో జవాన్‌, తెలుగులో గాడ్‌ఫాదర్‌, తమిళంలో కనెక్ట్‌ అనే మూవీల్లో నటిస్తోంది. ఇవి షూటింగ్‌ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈమె తన ప్రియుడు విగ్నేష్‌ శివన్‌ను వివాహం చేసుకోనుంది. ప్రస్తుతం ఆ పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment