Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నా కూడా పర్సనల్ లైఫ్‌లో మాత్రం అనేక అవరోధాలు ఎదుర్కొంటోంది. ప్రభుదేవా, శింబుతో బ్రేకప్ అయిన నయనతార గత కొద్ది రోజులుగా విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. పెళ్లి చేసుకోవాలని ఆమె గత రెండేళ్లుగా చర్చలు జరుపుతోంది. మీడియా ఆ విషయంలో ఎప్పుడు ప్రశ్నించినా కూడా తమ జీవితం గురించి తమకు తెలుసునని చాలాసార్లు కౌంటర్ ఇచ్చింది.
ఈ సారైనా నయన్ ప్రేమాయణం విషయంలో ఎలాంటి అవరోధాలు రాకుండా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నయనతార పుట్టుక దోషాలతో ముడిపడి ఉందని.. ముందుగా ఆమె ఆ దోషాలకి తగ్గ పరిహారం చేసిన తర్వాత వివాహం చేసుకుంటే మంచిదని.. లేదంటే భర్తకు అన్నీ కష్టాలే ఉంటాయని కథనాలొస్తున్నాయి.
ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతోంది. అయితే అంతకుముందు అవసరమైన అన్ని ఘట్టాల్ని పూర్తిచేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ముందుగా విఘ్నేష్ ని పెళ్లి చేసుకోవాలంటే అంతకంటే ముందే ఆమె ఓ చెట్టును వివాహం చేసుకోవాలట. అప్పుడే ఆ దోషం తొలగిపోతుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో నయనతార చెట్టుని వివాహం చేసుకొని ఆ తర్వాత విఘ్నేష్ శివన్‌ని పెళ్లాడనుందట. గతంలో ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకునే ముందు కూడా ఇలాగే చేశారు. ఆమె ఏకంగా మూడు చెట్లను వివాహం చేసుకుంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…