Nayanthara : లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన నయనతార వివాహం దర్శకుడు విగ్నేష్ శివన్‌తో ఇటీవలే జరిగిన విషయం విదితమే. జూన్ 9వ తేదీన మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనేక మంది సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరై వీరిని ఆశీర్వదించారు. అయితే ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న నయనతార పెళ్లి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరం కానుంది. ఆ తరువాత నెమ్మదిగా షూటింగ్‌లలో పాల్గొననుంది. అయితే వివాహం అనంతరం ఈమె చిత్ర దర్శక నిర్మాతలకు కొత్త కండిషన్లు పెడుతున్నదట. అవును.. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నయనతార వివాహం చేసుకున్నాక పూర్తిగా మారిపోయింది. ఇకపై సినిమాలు చేయాలంటే ఆమె మేకర్స్‌కు కొత్త కండిషన్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఏ సినిమాలోనూ గ్లామర్ సీన్లు చేయబోనని.. ఈ విషయంలో తాను కచ్చితంగా ఉంటానని.. ఆమె మేకర్స్‌కు కండిషన్ పెట్టిందట. అలాగే తనకు ఖాళీగా ఉన్న సమయాల్లోనే సినిమాల్లో నటిస్తానని.. కనుక అదేవిధంగా తన కాల్ షీట్స్ కూడా ఉంటాయని.. కాబట్టి తనకు అనుగుణంగానే దర్శక నిర్మాతలు షూటింగ్ లను సెట్ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పేసిందట. దీంతో నయనతారతో సినిమా చేయాలంటే మేకర్స్ ప్రస్తుతం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే సినిమాల్లో హీరోలతో సన్నిహితంగా ఉండే ఇంటిమేట్ సీన్లు కూడా చేయబోనని నయనతార చెప్పేసిందట. సో.. ఇకపై నయనతార సినిమాల్లో పూర్తి ఫ్యామిలీ క్యారెక్టర్‌లా కనిపించబోతుందన్నమాట.
అయితే దీన్ని అదనుగా చూసుకుని కొందరు సమంతపై సెటైర్లు వేస్తున్నారు. సమంత కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా బోల్డ్ సీన్లలో నటించిందని.. నయనతారకు ఉన్న జ్ఞానం కూడా ఆమెకు లేదని.. ఆమెకు డబ్బే ప్రధానమని.. అందుకు ఆమె ఎలాంటి సీన్లలో అయినా నటిస్తుందని.. డబ్బు సంపాదించడం కోసం ఆమె ఏమైనా చేస్తుందని.. కొంచెమైనా సమంత అర్థం చేసుకోవాలని అంటున్నారు. అయితే ఇలాంటి విమర్శలను పట్టించుకోనని సమంత ఎప్పుడో చెప్పేసింది. కనుక ఇప్పుడు ఆమె నుంచి స్పందనను ఆశించడం కూడా అర్థరహితమే అవుతుందని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…