Nayanthara : కోలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఉన్న నయనతార జూన్ 9న విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న విషయం విదితమే. అయితే ఈ దంపతులకు తాజాగా కవలలు జన్మించారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీరికి పెళ్లి అయి కేవలం నాలుగు నెలలే అవుతోంది.. అప్పుడే పిల్లలు ఎలా పుట్టారు.. అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులై సరికొత్త రికార్డును వీరు క్రియేట్ చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అందరూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అంతేకాదు.. సినీ సెలబ్రిటీస్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
నయనతార, విగ్నేష్ దంపతులు తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరు రెండు సార్లు హనీమూన్లకు వెళ్లి వచ్చారు. ఇక త్వరలోనే మూడో హనీమూన్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే విగ్నేష్ శివన్ తన అఫిషియల్ ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ పేజీలలో వాళ్లి తల్లిదండ్రులయ్యారు అనే విషయం చెప్పుకొచ్చారు. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ అఫిషియల్ గా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాకవుతున్నారు. మరి కొంతమంది కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ జనాలకు ఈ విషయం షాకింగ్ గానే ఉంది. పెళ్లైన నాలుగు నెలలకే వీరు ఎలా తల్లిదండ్రులయ్యారో అర్థం కావడం లేదని అంటున్నారు. అంటే పెళ్లికి ముందే వీరు సరోగసీ ప్లాన్ చేశారని అర్థం చేసుకోవచ్చు.
ఇక విగ్నేష్ శివన్ తన సోషల్ ఖాతాల్లో ఇలా రాసుకొచ్చాడు. నేను, నయనతార తల్లిదండ్రుల అయ్యాం. మాకు ఇద్దరు ట్విన్స్ కొడుకులు పుట్టారు. ఈ క్షణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. మాతోపాటు మా బిడ్డలని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం.. అంటూ ఆ చిన్నారుల కాళ్ళను ముద్దాడుతున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ ఊహించని షాక్‌తో నెటిజన్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొందరు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…