Nayanthara : పెళ్ల‌యిన 4 నెల‌ల‌కే పిల్ల‌లా.. ఇది ఎలా సాధ్యం.. నివ్వెర‌పోతున్న నెటిజ‌న్లు..!

October 10, 2022 7:34 AM

Nayanthara : కోలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఉన్న నయనతార జూన్ 9న విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ దంప‌తుల‌కు తాజాగా క‌వ‌ల‌లు జ‌న్మించారు. దీంతో ఈ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీరికి పెళ్లి అయి కేవ‌లం నాలుగు నెల‌లే అవుతోంది.. అప్పుడే పిల్ల‌లు ఎలా పుట్టారు.. అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. అయితే పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులై సరికొత్త రికార్డును వీరు క్రియేట్ చేశార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అంద‌రూ వీరికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అలాగే ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అంతేకాదు.. సినీ సెలబ్రిటీస్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

న‌య‌న‌తార‌, విగ్నేష్ దంప‌తులు తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్‌లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వీరు రెండు సార్లు హనీమూన్ల‌కు వెళ్లి వ‌చ్చారు. ఇక త్వరలోనే మూడో హనీమూన్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే విగ్నేష్ శివన్ తన అఫిషియల్ ఇంస్టాగ్రామ్, ట్విట్ట‌ర్‌ పేజీల‌లో వాళ్లి తల్లిదండ్రులయ్యారు అనే విషయం చెప్పుకొచ్చారు. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ అఫిషియల్ గా ప్ర‌క‌టించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక‌వుతున్నారు. మరి కొంతమంది కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ జనాలకు ఈ విషయం షాకింగ్ గానే ఉంది. పెళ్లైన నాలుగు నెలలకే వీరు ఎలా తల్లిదండ్రులయ్యారో అర్థం కావడం లేద‌ని అంటున్నారు. అంటే పెళ్లికి ముందే వీరు స‌రోగ‌సీ ప్లాన్ చేశార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

Nayanthara and Vignesh Shivan blessed with twin boys
Nayanthara

ఇక విగ్నేష్ శివన్ తన సోష‌ల్ ఖాతాల్లో ఇలా రాసుకొచ్చాడు. నేను, నయనతార తల్లిదండ్రుల అయ్యాం. మాకు ఇద్దరు ట్విన్స్ కొడుకులు పుట్టారు. ఈ క్షణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. మాతోపాటు మా బిడ్డలని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం.. అంటూ ఆ చిన్నారుల‌ కాళ్ళను ముద్దాడుతున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ ఊహించని షాక్‌తో నెటిజ‌న్లకు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. కొందరు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఇది ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్త ప్ర‌స్తుతం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now