Natu Natu Song : నాటు నాటు సాంగ్ పై విమ‌ర్శ‌లు.. లోపాల‌ను ఎత్తి చూపుతున్న నెటిజ‌న్స్..

Natu Natu Song : ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో సినిమా చేయాలంటే అది రిస్క్‌తో కూడుకున్న ప‌ని. ఇరువురు హీరోల అభిమానులని మెప్పించ‌డం అనేది పెద్ద టాస్క్‌. అయితే అలాంటి టాస్క్‌ని హ్యాపీగా స్వీక‌రించాడు రాజ‌మౌళి. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వెయ్యి కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. అంతేకాదు ఇంటా బ‌య‌టా కూడా మంచి ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే గుడ్డు మీద ఈక‌లు పీకే వాళ్లు ఏదో వంక చూపిస్తూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా నాటు నాటు సాంగ్ విష‌యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా వార్ న‌డుస్తోంది.

Natu Natu Song

తాజాగా నాటు నాటుకు చెందిన వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ ల డాన్స్ ను చూస్తూ ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు . ఇద్దరు స్టార్ హీరోలు అలా డాన్స్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటున్నారు అభిమానులు. బ్రిటిష్ వారి ముందు తెలుగు నాటును చూపించి మెప్పించారు. ఈ సాంగ్ కోసం రాజమౌళి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. ఈ సాంగ్ కోసం మేము పడ్డ కష్టం అంతా ఇంతా కాదని.. చరణ్, తారక్ ఇంటర్వ్యూల‌లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు బాగా చేశారు.. అనే దానిపై ట్విట్ట‌ర్ వేదిక‌గా వార్ న‌డుస్తోంది.

ఇద్దరు స్టార్స్ డ్యాన్స్ క‌దలిక‌ల మ‌ధ్య సింక్ కాని స్టెప్స్ ఎత్తి చూపుతూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఫాస్ట్ బీట్‌లో ఇద్ద‌రు హీరోల డ్యాన్స్ విష‌యంలో చాలా తేడాలు గ‌మ‌నించారు. ఈ సాంగ్ కోసం 17 టేకులు చేయించాన‌ని చెప్పిన రాజ‌మౌళి మ‌రి ఇంత నాన్ సింక్‌గా ఎలా చూపించాడంటూ కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

ఇద్దరు హీరోల్లో రెండు అంశాల కోసం బాగా మాట్లాడుకుంటున్నారు. ఒకటి ఎన్టీఆర్ మెరుపు వేగంతో చేసిన‌ డాన్స్ మూమెంట్స్ కాగా రెండోది చరణ్ ఈ సాంగ్ లో చూపించిన గ్రేస్.. పలు సందర్భాల్లో తాను పలికించిన హావ భావాలు. ఈ సాంగ్‌ వచ్చాక అందరూ ఆయా అంశాల‌ కోసమే ఎంతగానో మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి అయితే ఈ సాలిడ్ సాంగ్ మళ్లీ ఇలా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM