Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న పూజా హెగ్డె దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటోంది. టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నా కూడా ఐటమ్ సాంగ్‌లకి సై అంటోంది. ఇప్పటికే రంగస్థలం చిత్రంలో మాస్ డ్యాన్స్ చేసి ఓ ఊపు ఊపిన పూజా హెగ్డె ఇప్పుడు ఎఫ్ 3 లో స్పెషల్ నంబర్ చేయనుందట. ఇందుకోసం భారీగా డిమాండ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం పూజాను సంప్రదించగా.. తాను రూ.1.50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఫైనల్‌గా మేకర్స్ తనను రూ.1 కోటికి ఒప్పించినట్టు టాక్. ఇప్పటికే రంగస్థలంలో జిగేలు రాణిగా మెప్పించింది పూజా హెగ్డె.
పూజా.. ప్రభాస్‌తో కలిసి నటించిన రాధే శ్యామ్ సినిమా ఇటీవల విడుదలయ్యి తన యాక్టింగ్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన బీస్ట్ తో పూజా కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక బీస్ట్ సినిమాలో పూజా గ్లామర్‌కు, డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తెలుగులో ఒక్క సినిమా చేసేందుకు పూజ రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. అయితే బీస్ట్ సినిమా కోసం మాత్రం పూజా భారీగానే వసూలు చేసింది. బీస్ట్ కోసం పూజకు రూ.3.50 కోట్లు దక్కాయి. ఇక విజయ్ కూడా ఈ సినిమా కోసం ఏకంగా రూ.70కోట్లు తీసుకున్నాడని సమాచారం.
పూజా హెగ్డె ఒక్క ప్రకటన చేసేందుకు పూజ రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలు ఛార్జ్ చేస్తోంది. తన అందం, నటనతోపాటు.. స్టైలిష్ లుక్‌తో పూజా ఎప్పుడు హాట్ టాపిక్‌గా ఉంటుంది. అయితే ఈ అమ్మడి రెమ్యునరేషన్ గురించి వింటుంటేనే నిర్మాతల గుండెల్లో గుబులు పుడుతోంది.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ టాప్ ప్లేస్‌కు దూసుకుపోతోంది పూజా హెగ్డె. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా చిత్రాల్లోనూ ఈమె చోటు దక్కించుకుంటోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…