Namrata Shirodkar : ప‌వ‌న్ దంప‌తుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మ‌హేష్ భార్య‌.. ఎందుకో తెలుసా?

December 24, 2021 2:33 PM

Namrata Shirodkar : టాలీవుడ్ సూప‌ర్ స్టార్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు ఫ్యామిలీల మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఈ ఇద్ద‌రు హీరోల‌కు అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌గా, వారి అభిమానులు వీరిని జంట‌గా చూడాల‌ని క‌ల‌లు కంటున్నారు. కానీ అదైతే ఇప్ప‌టి వర‌కు జ‌ర‌గ‌లేదు కానీ ఒక‌రినొక‌రు ప‌లు సంద‌ర్భాల‌లో విష్ చేసుకున్నారు. ఆ మ‌ధ్య దీపావళి పండగ సంద‌ర్భంగా.. శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ పలువురు సినీ ప్రముఖులకు కానుకలు పంపారు పవన్ కల్యాణ్.

Namrata Shirodkar said thanks to pawan kalyan and his wife

సూప‌ర్ స్టార్ మహేశ్ కుటుంబానికి ప్ర‌త్యేక‌మైన‌ గిఫ్ట్ అందించారు. ఇందులో పర్యావరణానికి హాని చేయని గ్రీన్ క్రాక‌ర్స్ తో పాటు స్వీట్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రత సోష‌ల్ మీడియా ద్వారా తెలియజేశారు. కానుకలు పంపినందుకు పవన్​కు థ్యాంక్స్ చెప్పారు. ఇక క్రిస్మ‌స్ కానుక‌గా ప‌లు గిఫ్ట్స్ పంపించారు ప‌వ‌న్. దర్శకుడు వేణు శ్రీరామ్ దంపతులకి విషెష్ చెబుతూ గిఫ్ట్ పంపించారు పవన్.

దీనిని శ్రీరామ్ వేణు సతీమణి సోషల్ మీడియాలో వీడియో ద్వారా షేర్ చేశారు. పవన్ పంపిన గ్రీటింగ్స్ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఏమేం ఉన్నాయో చూపించి పవన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇక మ‌హేష్ కుటుంబానికి కూడా ప‌వ‌న్ దంప‌తులు ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్‌లతోపాటు గ్రీటింగ్స్ ని పంపించారు. ఈ గ్రీటింగ్స్ ని మహేష్ సతీమణి నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లో పెట్టి ఈ లవ్లీ హాంపర్ ని పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now