Nalla Venu : సినిమా ఆఫ‌ర్ల కోసం ఆ ప‌నులు కూడా చేశా : వేణు

మార్చి 15, 2022 7:48 ఉద.

Nalla Venu : సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఉన్న క‌మెడియ‌న్ల‌లో వేణు ఒక‌రు. న‌ల్ల వేణుగా ఈయ‌న పేరుగాంచారు. ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించారు. గ‌తంలో ఈయ‌న జ‌బర్ద‌స్త్ షోల‌లో కూడా పాల్గొన్నారు. అయితే సినిమా ఇండ‌స్ట్రీ అంటే పూల పాన్పు కాద‌ని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ ఇండ‌స్ట్రీలో పైకి రావాలంటే చాలా క‌ష్ట‌మ‌ని.. ఆఫ‌ర్లు అంత సుల‌భంగా ఏమీ రావ‌ని.. అందుకు చాలా క‌ష్ట ప‌డాల్సి ఉంటుంద‌ని వేణు తెలిపాడు.

Nalla Venu said he has done so many things for movie offers
Nalla Venu

తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. తాను ఇంట్లో నుంచి పారిపోయి న‌టున్ని కావాల‌నే కోరితో హైద‌రాబాద్‌కు వ‌చ్చాన‌ని తెలిపాడు. ఇక్క‌డ అన్న‌దానాలు చేసే చోట తిని రోడ్ల మీద ప‌డుకున్నాన‌ని.. కొంద‌రితో ప‌రిచయాలు పెంచుకుని వారిని బ‌తిమాలి వారి రూమ్‌ల‌లో ఉన్నాన‌ని.. అయితే వారు త‌న‌ను ప‌నివాడిగా చూశార‌ని అన్నాడు. కానీ ఎంతో క‌ష్ట‌ప‌డి ఎన్నో ఆఫీస్‌లు, స్టూడియోలు.. ద‌ర్శ‌క నిర్మాత‌ల ద‌గ్గ‌ర‌కు కాళ్ల‌రిగేలా తిరిగాన‌ని.. తెలిపాడు.

ఇక కొన్ని సంద‌ర్భాల‌లో అయితే ఆఫ‌ర్ల కోసం తాను బాత్‌రూమ్‌లు కూడా క‌డిగాన‌ని వేణు ఆవేద‌న‌గా చెప్పాడు. అయితే వేణు ప్ర‌స్తుతం క‌మెడియ‌న్‌గా రాణిస్తున్నాడు. ప‌లు టీవీషోల‌తోపాటు ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారు రావ‌డం చాలా కష్ట‌మ‌ని వేణు తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment