Nagarjuna : బుల్లితెరపై బిగ్ బాస్ హంగామా మొదలైంది. ఎప్పటిలాగే కంటిస్టెంట్స్ పోటీపడుతూ హౌస్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. ఇందులో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అలకలు, ఉరుకులు, పరుగులు, టాస్క్‌లు, లవ్‌లు, ఎఫైర్లు, బ్రేకప్.. అబ్బో ఒక్కటేమిటి కాదేదీ గొడవకు అనర్హం అన్నట్టుగా కంటెస్టెంట్స్ మధ్య ఫిటింగ్‌లు పెడుడూ ఉంటాడు బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 6 విజయవంతంగా రన్ అవుతుంది. అయితే ఎంత సక్సెస్ అయ్యిందో అన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటుంది బిగ్ బాస్. బిగ్ బాస్ తో పాటు కింగ్ నాగార్జున కూడా విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తోంది. బిగ్ బాస్ ను ఘోరంగా విమర్శిస్తున్న వారిలో సీపీఐ సీనియర్ లీడర్ నారాయణ ఒకరు.
అది బిగ్ బాస్ హౌస్ కాదని.. బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా.. నాగార్జున లాంటి వ్యక్తి ఇలాంటి ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించడం ఏంటి.. డబ్బు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదంటూ నాగార్జునపై నారాయణ విమర్శలు చేశాడు. అయితే నాగార్జున ఇలాంటి విమర్శలు ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ నారాయణ చేస్తున్న ఆరోపణలు రోజురోజుకు హద్దులు దాటుతుండడంతో ఏకంగా బిగ్ బాస్ వేదికపై నాగార్జున తన స్టైల్లో నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. శని, ఆదివారాల్లో హౌస్ లో నాగార్జున సందడి చేస్తుంటాడు.
ఈ క్రమంలోనే శనివారం ఎపిసోడ్‌లో కపుల్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెరీనా రోహిత్ గురించి మాట్లాడుతూ.. రోహిత్ మేరీనాని కాస్త బాగా చూసుకోవయ్యా అంటూ చెప్పడమే కాకుండా ఒకసారి ప్రేమగా తనకు టైట్ హాగ్ ఇవ్వు అంటూ పర్మిషన్ ఇచ్చాడు. అంతేకాదు ఇతరుల విషయంలో ఏమో కానీ ఇక్కడ మీకు లైసెన్స్ ఉంది.. మీరిద్దరూ భార్యాభర్తలు మీరు ఇద్దరు హగ్ చేసుకోవడంలో తప్పులేదు అని.. వారు హగ్ చేసుకునే సమయంలో నారాయణ.. నారాయణ వారిద్దరికీ పెళ్ళయింది అంటూ సామెత చెపుతున్నట్టుగానే.. అంటూ నారాయణకు కౌంటర్ ఇచ్చాడు. ఇలా వీరిద్దరూ భార్యాభర్తలని వీళ్ళు హగ్ చేసుకుంటే తప్పులేదు అంటూ పరోక్షంగా నాగార్జున.. సీపీఐ నేత నారాయణకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…