Nagarjuna : స‌మంత‌నే ముందుగా విడాకులు అడిగింది.. నాగ‌చైత‌న్య ఒప్పుకోక త‌ప్ప‌లేదు.. నాగార్జున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

January 27, 2022 12:26 PM

Nagarjuna : నాగ‌చైత‌న్య‌, స‌మంతలు అక్టోబ‌ర్ 2021లో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. వీరి నిర్ణ‌యంతో యావ‌త్ సినీ ప్ర‌పంచం ఉలిక్కి పడింది. అభిమానులు షాక్ తిన్నారు. టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరొందిన వీరు విడాకులు తీసుకోవ‌డం ఏమిట‌ని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. వీరి విడాకుల నిర్ణ‌యం చాలా మందికి న‌చ్చ‌లేదు.

Nagarjuna said samantha wanter divorce first

అయితే నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల‌పై నాగార్జున స్పందించారు. ఓ బాలీవుడ్ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. అస‌లు స‌మంత‌నే ముందుగా విడాకులు కావాల‌ని అడిగింద‌ని అన్నారు.

అయితే ఉన్న‌ట్లుండి స‌డెన్ గా స‌మంత విడాకులు ఎందుకు అడిగిందో చైత‌న్య‌కు అర్థం కాలేద‌ని, అత‌ను స‌మంత నిర్ణ‌యాన్ని అంగీక‌రించ‌క త‌ప్ప‌లేద‌ని అన్నారు. అయితే విడాకుల వ‌ల్ల త‌న తండ్రి ఎంత‌గా కుమిలిపోతాడో, త‌న ఫ్యామిలీ ప‌రువు ఏమైపోతుందోన‌ని నాగ‌చైత‌న్య ఆలోచించాడ‌ని, కానీ ఇద్ద‌రికీ ఇష్ట‌మైతే విడాకులు తీసుకోండ‌ని చెప్పాన‌ని నాగార్జున‌ అన్నారు.

2021 న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను కూడా స‌మంత‌, చైత‌న్య ఇద్ద‌రూ క‌లిసి జ‌రుపుకున్నారు. ఇంతలోనే ఏమైందో తెలియ‌దు, స‌మంత‌నే ముందుగా విడాకులు కావాల‌ని అడ‌గ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.. అని నాగార్జున తెలిపారు.

అయితే స‌మంత సినిమాలు, సిరీస్‌ల‌లో బోల్డ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డం అటు చైత‌న్య‌కు, ఇటు నాగార్జున‌కు ఇష్టం లేద‌ని.. అందుక‌నే స‌మంత విడాకులు తీసుకుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు బాగా వినిపించాయి. ఇక వారి విడాకుల‌కు కార‌ణం కూడా అదేన‌ని ఇప్ప‌టికీ చాలా మంది భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Nagarjuna : స‌మంత‌నే ముందుగా విడాకులు అడిగింది.. నాగ‌చైత‌న్య ఒప్పుకోక త‌ప్ప‌లేదు.. నాగార్జున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..”

Leave a Comment