Naga Chaithanya : చైతూతో అనుష్క ఎంగేజ్‌మెంట్‌.. నాగార్జున ఏమ‌న్నాడు..!

November 18, 2021 7:05 PM

Naga Chaithanya : అక్కినేని నాగ చైత‌న్య పేరు గ‌త కొద్ది రోజులుగా తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తోంది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత‌తో కొన్ని విభేదాల వలన విడిపోయాడు చైతూ. అయితే సామ్.. చై తో విడిపోయిన దగ్గరనుంచి ఆమె చేసే పనులు కొద్దిగా బాధను తెలియజేస్తున్నాయి. పెళ్లి గురించి, జీవితం గురించి ఆమె పెట్టే పోస్టులు ఆమె చై ని ఎంత మిస్ అవుతుందో తెలియజేస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు.

nagarjuna responded on Naga Chaithanya and anushka engagement news then

చైతూ మాత్రం సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటూ త‌న ప‌నులు తాను చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా చైతూ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 2017 లో నాగ చైత‌న్య‌ – అనుష్క ఎంగేజ్‌మెంట్ కి సంబంధించిన ప‌లు వార్త‌లు రాగా, దానిపై నాగార్జున రియాక్ట్ అయ్యారు.

నాగచైతన్య, అనుష్కశెట్టికి ఎగేంజ్ మెంట్ జరిగిందనే వార్త నా వరకు వచ్చింది. ఆ సమయంలో చైతూ స్విట్జర్లాండ్‌లో షూటింగ్ చేస్తున్నాడు. నేను ఉదయాన్నే చైతూకు ఫోన్ చేసి చెప్పాను. ‘‘హేయ్, నీకు నిన్న రాత్రి అనుష్కతో నిశ్చితార్థం జరిగింది, మీరు నాకు కూడా చెప్పలేదు అని అడిగాను . దానికి చైతూ రెస్పాండ్ అవుతూ.. ‘వాహ్, నిజమే’ అని బిగ్గరగా నవ్వాడు.

ఆ తర్వాత నేను అనుష్కని కూడా పిలిచి అడిగా. అందరం బాగా నవ్వుకున్నాము.” అని అన్నారు నాగార్జున. సాధార‌ణంగా రూమ‌ర్స్‌ని కొంద‌రు సెల‌బ్స్ బాగా ఎంజాయ్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం ఫైర్ అవుతుంటారు. కాగా, అనుష్క‌తో నాగ్ ఎఫైర్ న‌డిపాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now