Nagarjuna : భూమి కొనుగోలు విషయంలో దారుణంగా మోసపోయిన నాగార్జున ?

October 9, 2021 5:23 PM

Nagarjuna : సాధారణంగా ఏ రంగంలోనైనా పనిచేసి బాగా డబ్బులు సంపాదిస్తున్న తర్వాత ఎవరైనా కూడా ఆస్తులను పోగు చేసుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పనిచేసే ఎంతో మంది సెలబ్రెటీలు వారు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత ఆస్తులను కొనుగోలు చేయడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే గతంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఉన్న నాగార్జున సైతం ఒక భూమిని కొనుగోలు చేసే విషయంలో దారుణంగా మోసపోయారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Nagarjuna cheated by own relative in a land issue

నాగార్జున గచ్ఛిబౌలి ప్రాంతంలోని ఒక భూమిని కొనుగోలు చేసి దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ భూమిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కొన్నారని.. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వయానా తన సమీప బంధువని తెలుస్తోంది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన బంధువు కావడంతో అతనిపై ఉన్న నమ్మకం వల్ల భూమిని కొనుగోలు చేసిన నాగార్జున ఏకంగా అతడు చేసిన మోసానికి కోట్ల రూపాయలు నష్టాన్ని ఎదుర్కొన్నారట.

అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని కుటుంబానికి వేల కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇలా అన్ని విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండే అక్కినేని కుటుంబం ఇలా సమీప బంధువుల చేతిలో మోసపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment