Vaishnav Tej : చిన్న వ‌య‌స్సులో ర‌కుల్‌ని ఎలా ప్రేమించావు ? వైష్ణ‌వ్‌ని ప్ర‌శ్నించిన నాగ్..

October 9, 2021 3:49 PM

Vaishnav Tej : మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో వ‌చ్చినా కూడా మంచి స‌క్సెస్ సాధిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ రీసెంట్‌గా కొండ పొలం చిత్రంతో అభిమానుల ముందుకు వ‌చ్చాడు. ఇందులో ఓబుల‌మ్మ‌గా ర‌కుల్ క‌నిపించింది. క‌టారి ర‌వీంద్ర పాత్ర‌లో వైష్ణవ్ తేజ్ క‌నిపించి మెప్పించాడు. స‌న్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా కొండ‌పొలం చిత్రాన్ని తెర‌కెక్కించాడు దర్శకుడు క్రిష్.

nagarjuna asked Vaishnav Tej  that how he loved rakul preet singh

నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బీటెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు.. బీటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు.. వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు. వాటిని ఆధారంగా చేసుకొని క్రిష్ చిత్రాన్ని తెరకెక్కించాడు. చిత్రం అన్ని వ‌ర్గాల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన‌ ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మించారు.

అక్టోబ‌ర్ 8న విడుద‌లైన ఈ సినిమాపై మ‌రిన్నిఅంచ‌నాలు పెంచేందుకు బిగ్ బాస్ షోకి హాజ‌రైంది చిత్ర‌ బృందం. క్రిష్‌, వైష్ణ‌వ్ తేజ్ బిగ్ బాస్ షోకి హాజ‌రు కాగా వారు నాగార్జున‌తో క‌లిసి సంద‌డి చేశారు. ఇంత చిన్న వ‌య‌స్సులో ర‌కుల్‌ని ఎలా ప్రేమించావు అని నాగార్జున ప్ర‌శ్నించ‌గా, దానికి త‌ప్ప‌లేదు అని చెప్పాడు. ఇక క్రిష్ త‌ను హ‌మీదా కోసం ఏదైనా చేసే వాడిని అన్నాడు. మీరు 45 రోజులు అడ‌వుల‌లో షూట్ చేస్తే మా వాళ్లు 105 రోజులు ఇక్క‌డ ఉండ‌నున్నార‌ని నాగార్జున అన్నారు. నేటి షో సంద‌డిగా సాగ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment