Nagababu : ఆస్తుల కంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అప్పులే ఎక్కువ.. అని చెప్పిన నాగబాబు..

February 1, 2023 4:07 PM

Nagababu : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. త‌న కొడుకు పెళ్లి, రోజా కామెంట్స్, జ‌బ‌ర్ధ‌స్త్ రీ ఎంట్రీతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి వంటి వాటికి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. క‌ళ్యాణ్ బాబుకి ఆస్తుల కన్నా కూడా అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే పవన్‌కి అప్పులు ఉన్నాయంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. పార్టీ కోసం ప్రజల కోసం తన సంపాదన నుంచే హెల్ప్ చేస్తుంటాడు. జనసేన స్థాపించిన సమయంలో పిల్లల పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు తీశాడంటూ వచ్చిన వార్తలు కూడా నిజమే అని నాగ‌బాబు చెప్పుకొచ్చారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తులు మొత్తం తాకట్టులోనే ఉన్నాయి. తనకంటూ ఉన్న ఆస్తులు ప్ర‌స్తుతానికి ఏమీ లేవు. ఒక్క ఫామ్ హౌస్ మాత్రమే ఉంది. అతడికి ఒకే ఒక్క ఆస్తి. 8 ఎకరాల పొలం మాత్రమే. ఎంతో ఇష్టంతో కొనుకున్నాడు. జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తాను తీసుకున్న రూ.కోటిన్నర రెమ్యూనరేషన్‌ని డిస్టిబ్యూటర్స్‌కి వెనక్కి ఇచ్చేశాడు. త‌ను సేవ్ చేసుకున్న వాటిని కూడా ఇచ్చేశాడు. 8 ఎకరాల పొలం కూడా ఇచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు దాని విలువ రూ.15 లక్షల వరకు ఉంది. అయితే దానిని ఇవ్వొద్ద‌ని నేను అడ్డుపడి బలవంతంగా ఆపాను. ఇష్టపడి కొనుకున్న ఆ పొలం దేనికి అమ్మడం అని అడ్డుపడ్డాను.

Nagababu told that pawan kalyan has more debts than assets
Nagababu

తనకున్న ఇల్లు కార్లు కూడా లోన్లోనే ఉన్నాయి. ఆస్తులు కూడబెట్టాలని అన్న మనస్థత్వం ప‌వ‌న్‌కి ఏ మాత్రం లేదు అంటూ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ప‌వ‌న్ ఆస్తుల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, పవన్ సిల్వర్ స్క్రీన్ చరిష్మా కంటే ఆయన వ్యక్తిత్వానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్న విష‌యం తెలిసిందే. పదేళ్లపాటు ఒక్క హిట్టూ లేకపోయినా ఫ్లాపులతో రికార్డులు కొట్టడం, రెండుచోట్ల పోటీ చేసి ఓడినా విమర్శలను ఎదుర్కొని నిలబడి పోరాడటం అందరినీ ఎంత‌గానో ఆక‌ర్షిస్తూ ఉంటుంది. ఆప‌ద‌లో ఉన్నప్పుడు అండ‌గా నిల‌బ‌డుతూ ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నారు ప‌వన్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now