Nagababu : ఏపీ అసెంబ్లీలో తన భార్యపై వైసీపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేశారని, అనరాని మాటలు అన్నారని.. ఆరోపిస్తూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రెస్ మీట్‌లో కన్నీటి పర్యంతం అయిన విషయం విదితమే. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడూ ఏడ్చింది లేదు. ఆయన ఎప్పుడూ గంభీరంగా కనిపించేవారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రత్యర్థులపై నిప్పులు చెరిగేవారు. అలాంటి చంద్రబాబు ఒక్కసారిగా డీలా పడిపోయారు.
తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు లైవ్‌లోనే గుక్క పెట్టి ఏడ్చారు. అయితే దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఇది చాలా అనాగరికమైన చర్య అని ఆయన న్నారు. సాటి మనుషులపై క్రూరత్వం ప్రదర్శరిస్తున్నారని, నీచ సంస్కృతికి దిగజారవద్దని నాగబాబు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.
చంద్రబాబు గారు మాకు ప్రత్యర్థి అయ్యి ఉండవచ్చు.. తెలుగుదేశం పార్టీ మాకు ప్రతిపక్షం అయ్యి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నేత ఇలా కన్నీటి పర్యంతం అయిన ఘటన నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది.. అని నాగబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు కన్నీటిపర్యంతమైన ఘటన రాష్ట్ర రాజకీయ చరిత్రలో దుర్దినంగా ఆయన పేర్కొన్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు తలచుకుని బాధ పడలేక పడాలో తెలియని సందిగ్ధ దుస్థితి ఏర్పడిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజురోజుకీ పరాకాష్టకు నిలయంగా మారుతుందని అన్నారు.
ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో కించపరిచి తమని తాము హీనాతి – హీనమైన విలువలు లేని పురుగులుగా నిరూపించుకున్నారని నాగబాబు అన్నారు. ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప.. ఒకరి కుటుంబాలను దూషించే అధికారం ఎవరికీ లేదని ఆయన అన్నారు.
గతంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్, నా కుటుంబాన్ని ఇలాగే అనుచిత పదాలతో విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా.. ఆ బాధను అనుభవించిన మనిషిగా చెబుతున్నాను.. ఇది అనాగరికం మరియు సాటి మనుషుల పట్ల క్రూరత్వం. నీకు ఒకరు చేసింది తప్పు అనిపిస్తే ప్రశ్నించు, నిలదీసి అడుగు. లేదా తప్పు ఉంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించండి. అంతేకానీ ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారకండి.. అని నాగబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…